Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు! APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!! Guntur Railway Station: ప్రయాణికులకు భారీ ఊరట! గుంటూరు రైల్వేస్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ ప్రారంభం.. Train Time Changed: అనంతపురం మీదుగా వెళ్లే 4 రైళ్ల షెడ్యూల్ మార్పు.. జనవరి 1 నుంచి అమలు! Indian Railways News: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త… మరో 11 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాలకు అధికంగా!! Toll free travel: సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం.. పండుగ రద్దీకి చెక్ పెట్టే దిశగా! Transport Network: 32 దేశాల రోడ్డు వ్యవస్థలో భాగమైన తెలుగు రాష్ట్రాలు – ఏపీలో రెండు ఆసియా హైవేలు..!! హైదరాబాద్ టు విజయవాడ.. ఇక విమానంతో పోటీ పడనున్న రైలు ప్రయాణం! 160 కిలోమీటర్లకు - 3 గంటల్లోపే.. IndiGo Airlines: ఇండిగో పట్టు సడలుతోందా? దేశీయ విమానయాన మార్కెట్‌లో కీలక మార్పు..! Train Fire: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం…! 71 ఏళ్ల వృద్ధుడు మృతి.! Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు! APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!! Guntur Railway Station: ప్రయాణికులకు భారీ ఊరట! గుంటూరు రైల్వేస్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ ప్రారంభం.. Train Time Changed: అనంతపురం మీదుగా వెళ్లే 4 రైళ్ల షెడ్యూల్ మార్పు.. జనవరి 1 నుంచి అమలు! Indian Railways News: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త… మరో 11 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాలకు అధికంగా!! Toll free travel: సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం.. పండుగ రద్దీకి చెక్ పెట్టే దిశగా! Transport Network: 32 దేశాల రోడ్డు వ్యవస్థలో భాగమైన తెలుగు రాష్ట్రాలు – ఏపీలో రెండు ఆసియా హైవేలు..!! హైదరాబాద్ టు విజయవాడ.. ఇక విమానంతో పోటీ పడనున్న రైలు ప్రయాణం! 160 కిలోమీటర్లకు - 3 గంటల్లోపే.. IndiGo Airlines: ఇండిగో పట్టు సడలుతోందా? దేశీయ విమానయాన మార్కెట్‌లో కీలక మార్పు..! Train Fire: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం…! 71 ఏళ్ల వృద్ధుడు మృతి.!

APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!!

2026-01-01 12:35:00
ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు!

ఆంధ్రప్రదేశ్‌లో  ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రభావం ఆర్టీసీ వ్యవస్థపైనా స్పష్టంగా కనిపిస్తుంది. రెండు కొత్త జిల్లాల ఏర్పాటు, కొన్ని జిల్లాల పరిధిలో జరిగిన మార్పులు–చేర్పుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమ డిపో వ్యవస్థను కూడా కొత్త జిల్లాల వారీగా పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అధికారిక ఆదేశాలు జారీ చేయగా ఈ మార్పులు బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్!

కొత్తగా ఏర్పడిన పోలవరం మార్కాపురం జిల్లాలకు అనుగుణంగా డిపోలను కేటాయించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పోలవరం జిల్లా పరిధిలో ప్రస్తుతం ఒక్క ఆర్టీసీ డిపో కూడా లేదు. ఇప్పటివరకు రంపచోడవరం బస్టాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉండగా, ఇప్పుడు అది పోలవరం జిల్లాలోకి మారింది. దీంతో ఆ బస్టాండ్ నిర్వహణ బాధ్యతలను తూర్పుగోదావరి జిల్లా గోకవరం డిపో మేనేజర్‌కు అప్పగించారు. ఇదే సమయంలో మార్కాపురం జిల్లా పరిధిలో కనిగిరి, పొదిలి, మార్కాపురం, గిద్దలూరు డిపోలు చేరాయి.

ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు!

కొత్త జిల్లాలకు జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి పోస్టులను కూడా సృష్టించారు. పోలవరం జిల్లా కేంద్రంగా రంపచోడవరాన్ని నిర్ణయించగా, ఈ జిల్లాకు తూర్పుగోదావరి జిల్లా డీపీటీవో వైఎస్‌ఎన్ మూర్తి బాధ్యతలు నిర్వహించనున్నారు. అలాగే మార్కాపురం జిల్లాకు ప్రకాశం జిల్లా డీపీటీవో జి. సత్యనారాయణను ఇన్‌చార్జ్‌గా నియమించారు. అవసరమైన సిబ్బంది నియామకాలు పూర్తయ్యే వరకు పొరుగు జిల్లాల అధికారులే ఈ బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

RBI Guidelines: నేటి నుంచే ఆర్‌బీఐ కొత్త రూల్స్.. ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ క్లోజ్!

జిల్లా కేంద్రాల మార్పులతో కొన్ని డిపోల పరిపాలనా పరిధి కూడా మారింది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లెకు మారడంతో గత ఆరు నెలలుగా చిత్తూరు జిల్లా డీపీటీవోగా ఉన్న రాము అన్నమయ్య జిల్లా డీపీటీవోగా కొనసాగుతూ, మదనపల్లె కేంద్రంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మార్పుల వల్ల రవాణా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు!

డిపోల సంఖ్య పరంగా చూస్తే, పోలవరం జిల్లా రాష్ట్రంలోనే డిపో లేని ఏకైక జిల్లాగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు ఒక్క డిపో మాత్రమే ఉంది. విజయనగరం జిల్లాలో విజయనగరం, ఎస్.కోట డిపోలు ఉండగా, అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం డిపోలు ఉన్నాయి. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 10 డిపోలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కడప, నంద్యాల, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఏడేసి డిపోలు ఉన్నాయి.

Postal: 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగం..! పరీక్ష లేకుండానే ఎంపిక!

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మొత్తం తొమ్మిది డిపోలు ఒక జిల్లా నుంచి మరో జిల్లా పరిధిలోకి మారాయి. కందుకూరు, అద్దంకి డిపోలు ప్రకాశం జిల్లాలోకి చేరగా, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, పొదిలి డిపోలు మార్కాపురం జిల్లాకు వెళ్లాయి. అలాగే గూడూరు డిపో తిరుపతి నుంచి నెల్లూరు జిల్లాకు, పుంగనూరు చిత్తూరు నుంచి అన్నమయ్య జిల్లాకు, రాజంపేట అన్నమయ్య నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు బదిలీ అయ్యాయి.

Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి!

 కొత్త జిల్లాల పాలన కోసం ఉన్నతాధికారుల నియామకాలు కూడా పూర్తయ్యాయి. పోలవరం జిల్లాకు ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా ఎస్. దినేష్ కుమార్‌ను, ఇన్‌చార్జ్ ఎస్పీగా అమిత్ బర్దర్‌ను నియమించారు. అలాగే తిరుమాని శ్రీ పూజను ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన ప్రారంభమవుతుందని, ప్రజలకు సేవలు మరింత చేరువ కావాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు!
H-1B వీసాపై ట్రంప్ షాక్! లక్ష డాలర్ల ఫీజుకు కోర్టు గ్రీన్ సిగ్నల్!
Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు..

Spotlight

Read More →