స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఒప్పో (OPPO) నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. తన పాపులర్ 'రెనో' సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 15 సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు కంపెనీ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెనో 15, రెనో 15 ప్రో, మరియు రెనో 15 ప్రో మిని మోడల్స్ రాబోతున్నాయని మనకు తెలుసు. అయితే, తాజాగా టెక్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ మూడింటితో పాటు ఒప్పో రెనో 15C (OPPO Reno 15C) అనే మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ కూడా ఈ సిరీస్‌లో చేరబోతోంది.
ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించిన లీక్స్ ప్రకారం, ఈ కొత్త ఫోన్ ఫీచర్లు మరియు ధర ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.
రెనో 15C స్మార్ట్‌ఫోన్ లీక్స్ :
భారత్ మార్కెట్లో ఒప్పో రెనో 15c స్మార్ట్‌ఫోన్ 6.57 అంగుళాల ఫుల్ HD LTPS OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపారు. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలిపారు. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ తో పనిచేస్తుందని అంచనా వేశారు. ఈ చిప్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.
కెమెరా: సెల్ఫీ ప్రియులకు పండగే!
రెనో సిరీస్ అంటేనే 'కెమెరా సెంట్రిక్' ఫోన్లు. ఈసారి కూడా ఒప్పో తన హొలోఫ్యూజన్ (Holofusion) టెక్నాలజీతో అద్భుతమైన ఫొటోలను వాగ్దానం చేస్తోంది. వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటాయి.
50MP మెయిన్ కెమెరా.
8MP అల్ట్రావైడ్ లెన్స్.
2MP మాక్రో లెన్స్.
సెల్ఫీ: ఈ ఫోన్ ముందు భాగంలో కూడా 50MP సెల్ఫీ కెమెరాను ఇస్తున్నట్లు లీక్స్ చెబుతున్నాయి. వీడియో కాల్స్ మరియు సోషల్ మీడియా రీల్స్ కోసం ఇది పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
బ్యాటరీ: 7000mAh భారీ కెపాసిటీ!
రెనో 15Cలో వినియోగదారులను ఆకర్షించే అతిపెద్ద ఫీచర్ దీని బ్యాటరీ. ఈ ఫోన్‌లో ఏకంగా 7000mAh బ్యాటరీని ఇస్తున్నట్లు సమాచారం. సాధారణంగా రెనో ఫోన్లు స్లిమ్‌గా ఉంటాయి, కానీ ఇంత పెద్ద బ్యాటరీని 8.14mm థిక్‌నెస్‌లో ఎలా అమర్చారనేది ఆసక్తికరంగా మారింది. 80W సూపర్ ఊక్ (SuperVOOC) ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
ధర మరియు లాంచ్ వివరాలు:
ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ రూ.40 వేల ధరలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ మోడల్, టిప్‌స్టర్ వెల్లడించిన స్పెసిఫికేషన్‌లపై ఒప్పో ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. త్వరలో ఈ ఫోన్ గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇటీవల టిప్‌స్టర్ పరాస్ గుగ్‌లానీ వెల్లడించిన వివరాల ఆధారంగా ఒప్పో రెనో 15 సిరీస్ భారత్ సహా ఇతర గ్లోబల్ మార్కెట్లలో జనవరి 8 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెనో 15 ఫోన్ సుమారు రూ.50 వేల ధరలో, అదే రెనో 15 ప్రో మిని ఫోన్ సుమారుగా రూ.40 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు.
ఒప్పో రెనో 15 సిరీస్ ఫోన్‌లు ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయి. మరియు ఒప్పో Holofusion టెక్నాలజీపై డిజైన్ చేసినట్లు తెలిసింది. రెనో 15 ఫోన్ గ్లేసియర్ వైట్, ట్విలైట్ బ్లూ, అరోరా బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అదే ప్రో మోడల్ Cocoa బ్రౌన్, సన్‌సెట్ గోల్డ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
అదే మిని మోడల్ Cocoa బ్రౌన్, గ్లేసియర్ వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ 6.32 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదే ప్రో మోడల్ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, బేస్ వేరియంట్ 6.59 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.