LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Technology

Internet Prices 2026: ఆ దేశంలో నెట్ వాడాలంటే రూ. 38 వేలు ఖర్చు చేయాల్సిందే... ఇక్కడ మాత్రం డేటా ఇంత చౌకగా ఎలా వస్తోంది?

Internet Prices 2026: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ధరల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో నెలకు రూ. 38,000 బిల్లు వస్తుంటే, భారత్‌లో మాత్రం డేటా అతి తక్కువ ధరకే లభిస్తోంది. అత్యంత ఖరీదైన దేశాలేవి? ఇండియాలో ధరలు ఎందుకు తక్కువ..

AndhraPravasi News Desk 2 min read
Internet Prices 2026: ఆ దేశంలో నెట్ వాడాలంటే  రూ. 38 వేలు ఖర్చు చేయాల్సిందే... ఇక్కడ మాత్రం డేటా ఇంత చౌకగా ఎలా వస్తోంది?

Technology: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డేటా ఎక్కడ?

ఆఫ్రికా, యూరప్ దేశాల్లోనూ చుక్కలే..

భారత్ ఎందుకు ఆదర్శంగా నిలుస్తోంది?

Internet Prices 2026: నేటి కాలంలో అన్నం లేకపోయినా ఉండగలరేమో కానీ, చేతిలో ఫోన్.. అందులో ఇంటర్నెట్ లేకపోతే క్షణం గడవని పరిస్థితి. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న పనికి డిజిటల్ డేటాపైనే ఆధారపడుతున్నాం. అయితే మన దేశంలో అతి తక్కువ ధరకే లభిస్తున్న ఇంటర్నెట్ ప్రపంచమంతా అలాగే ఉంటుందని అనుకుంటే పొరపాటే. కొన్ని దేశాల్లో నెట్ వాడాలంటే సామాన్యుల జేబులు ఖాళీ అవ్వాల్సిందే  ఆ దేశాలు  ఇప్పుడు చూద్దాం.

మనం ఇక్కడ నెలకు రూ. 300 లేదా రూ. 400 లతో అన్‌లిమిటెడ్ డేటా వాడుతుంటే, సోలమన్ ఐలాండ్స్ వంటి ద్వీప దేశాల్లో పరిస్థితి భయంకరంగా ఉంది. అక్కడ నెలవారీ ఇంటర్నెట్ బిల్లు సగటున 457 డాలర్లు.. అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 38,000. ఆ దేశం సముద్రం మధ్యలో ఉండటం వల్ల అండర్ వాటర్ కేబుల్స్ వేయడం కష్టమవ్వడమే ఈ అధిక ధరలకు ప్రధాన కారణం. అలాగే దుబాయ్ (UAE) లో కూడా డేటా చాలా ఖరీదు. అక్కడ కేవలం 1 Mbps స్పీడ్ కోసం మనం రూ. 360 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే, ఘనా వంటి దేశాల్లో ఇంటర్నెట్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. అక్కడ ఒక్క GB డేటా ధర సుమారు రూ. 3,600 వరకు ఉంటుంది. ఇక సంపన్న దేశమైన స్విట్జర్లాండ్‌లో కూడా నెట్ ధరలు ఎక్కువే. అక్కడ పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేయడానికి అయ్యే మౌలిక సదుపాయాల ఖర్చు వినియోగదారుల నెత్తిన పడుతోంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పొరుగు దేశం పాకిస్థాన్ కూడా ఈ జాబితాలో మొదటి పది స్థానాల్లోనే ఉంది.

ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇంటర్నెట్ విప్లవంలో భారత్ దూసుకుపోతోంది. మన దేశంలో 1 Mbps వేగానికి అయ్యే ఖర్చు సగటున రూ. 7 లోపే. దీనివల్ల సామాన్యుడు కూడా హై-స్పీడ్ డేటాను సులువుగా పొందగలుగుతున్నాడు. ప్రస్తుతం మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లు దాటడానికి ప్రధాన కారణం టెలికాం కంపెనీల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన పోటీయే. జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు తక్కువ ధరకే ప్లాన్లను ఆఫర్ చేస్తుండటంతో డిజిటల్ ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ధరలు ఎందుకు మారుతుంటాయి

ప్రతి దేశంలో నెట్ ధరలు ఒకేలా ఉండవు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తాయి:

భౌగోళిక పరిస్థితులు: ద్వీప దేశాలు లేదా కొండ ప్రాంతాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం కష్టం.

మౌలిక సదుపాయాలు: ఫైబర్ కేబుల్స్, శాటిలైట్ లింక్స్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు.

పోటీ: మార్కెట్‌లో ఎక్కువ కంపెనీలు ఉంటే పోటీ వల్ల ధరలు తగ్గుతాయి, లేదంటే గుత్తాధిపత్యం పెరిగి రేట్లు పెరుగుతాయి.

 ఇంటర్నెట్ అనేది కేవలం విలాసం మాత్రమే కాదు, అది ప్రాథమిక హక్కుగా మారుతోంది. భౌగోళిక అడ్డంకులు  పోటీ లేకపోవడం వల్ల కొన్ని దేశాల్లో ధరలు భారంగా ఉన్నప్పటికీ, భారత్ మాత్రం ఈ విషయంలో ప్రపంచానికి దిక్సూచిలా నిలుస్తోంది.

Be the first to react

More Coverage

6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!

6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!

6G Network: భారతదేశంలో 5G విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న 6G నెట్‌వర్క్ ప్రణాళి…