ఆధార్ కార్డు జిరాక్స్ కష్టాలకు చెక్.. జనవరి నుంచి కొత్త డిజిటల్ విధానం!
UIDAI New Aadhaar Update 2027: ఆధార్ కార్డు వినియోగంలో కీలక మార్పు రాబోతోంది. ఇప్పటివరకు హోటళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు వంటి చోట్ల గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ కార్డు ఫొటోకాపీలు సమర్పించాల్సి వచ్చేది. అయితే ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కొత్త డిజిటల్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. 2027 జనవరి నుంచి ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
- 2027 జనవరి నుంచి ఆధార్ డిజిటల్ ధృవీకరణ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం.
- వినియోగదారుడి అనుమతితోనే ఆధార్ వివరాలు డిజిటల్‌గా పంచుకునే సదుపాయం.
UIDAI New Aadhaar Update 2027: ఆధార్ కార్డు వినియోగంలో కీలక మార్పు రాబోతోంది. ఇప్పటివరకు హోటళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు వంటి చోట్ల గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ కార్డు ఫొటోకాపీలు సమర్పించాల్సి వచ్చేది. అయితే ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కొత్త డిజిటల్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. 2027 జనవరి నుంచి ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
యాప్‌తోనే ఆధార్ ధృవీకరణ
కొత్త విధానంలో ఆధార్ ఫిజికల్ కాపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వినియోగదారులు తమ మొబైల్ యాప్ ద్వారా డిజిటల్‌గా గుర్తింపును ధృవీకరించుకోవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు వంటి చోట్ల ఆధార్ ధృవీకరణ అవసరమైనప్పుడు వినియోగదారుడి అనుమతితోనే సంబంధిత వివరాలు డిజిటల్ రూపంలో అందుతాయి. దీంతో ఆధార్ ఫొటోకాపీలు తీసుకోవడం, భద్రపరచడం వంటి అవసరాలు తగ్గనున్నాయి.
100కిపైగా సంస్థలకు అనుసంధానం
ఈ డిజిటల్ వ్యవస్థను ప్రైవేట్ సంస్థలు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు అనుసంధానించేందుకు UIDAI ఇప్పటికే ప్రయత్నాలు చేపట్టింది. ఇప్పటికే ఏడాది వ్యవధిలో 100కిపైగా సంస్థలను ఈ విధానంలోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలకు ఈ సేవలను విస్తరించనున్నారు.
వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి చెక్
ఆధార్ ఫొటోకాపీల రూపంలో వ్యక్తిగత వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదాన్ని తగ్గించడం ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశం. కాగితపు ప్రక్రియను తగ్గించడంతో పాటు, వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత కల్పించనుంది. అయితే గ్యాస్, నీరు, విద్యుత్ కనెక్షన్లు, బ్యాంకింగ్ వంటి సేవలకు మాత్రం ఆధార్ ఫిజికల్ కాపీ అవసరం కొనసాగనుంది.
Tags
Be the first to react