2 వందే భారత్ సహా 5 రైళ్లలో విన్నూత్నంగా ఏఐ సహాయం తో "క్లీనింగ్" సిస్టమ్!

ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలోని రెండు వందేభారత్ రైళ్లతో పాటు 5 ప్రముఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లలో ఏఐ (AI) ఆధారిత క్లీనింగ్ చెక్స్ మరియు డిజిటల్ పర్యవేక్షణ సేవలను ప్రారంభించారు. ప్రయాణికుల ఫిర్యాదులను కేవలం 2 గంటల్లోగా పరిష్కరించే లక్ష్యంతో ఈ టెక్నాలజీని తెచ్చారు. జియో-ట్యాగింగ్, స్టాఫ్ ట్రాకింగ్, మరియు రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌తో రైళ్లలో పరిశుభ్రతను మరింత పటిష్టం చేయనున్నారు.

2 వందే భారత్ సహా 5 రైళ్లలో విన్నూత్నంగా ఏఐ సహాయం
2 వందే భారత్ సహా 5 రైళ్లలో విన్నూత్నంగా ఏఐ సహాయం
  • దిబ్రూగఢ్–ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌తో పాటు రెండు వందేభారత్ సర్వీసులకు టెక్ అప్‌గ్రేడ్!

  • న్యూ జల్పాయ్‌గురి–పాట్నా, న్యూ జల్పాయ్‌గురి–గౌహతి వందేభారత్ రైళ్లలో ఏఐ పర్యవేక్షణ!

  • జియో-ట్యాగింగ్, స్టాఫ్ ట్రాకింగ్, సెంట్రలైజ్డ్ మానిటరింగ్‌తో పక్కాగా హౌస్‌కీపింగ్ నిర్వహణ!

Technology: భారతీయ రైల్వే ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చివేసేలా ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) అత్యంత కీలకమైన ముందడుగు వేసింది. ప్రయాణ సమయంలో పరిశుభ్రత, శుచి, శుభ్రతలు మరియు ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు టెక్నాలజీ ఆధారిత మెరుగైన ఆన్-బోర్డ్ సేవలను ప్రవేశపెట్టింది. దేశంలోని ప్రధాన గమ్యస్థానాలను కలుపుతున్న 5 ప్రముఖ సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత క్లీనింగ్ అసెస్‌మెంట్స్‌ను అమలు చేయనున్నట్లు రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించారు.

ఎంపిక చేసిన 5 సూపర్ ఫాస్ట్ రైళ్ల వివరాలు

ఈ ఆధునిక టెక్నాలజీ సేవలను తొలి విడతగా 5 ప్రధాన రైలు సర్వీసులకు వర్తింపజేశారు. ఇందులో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు మరో మూడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి:

  • కామాఖ్య – ఎస్‌ఎంవీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్

  • గౌహతి – కోల్‌కతా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్

  • దిబ్రూగఢ్ – ముంబై ఎల్‌టీటీ (LTT) ఎక్స్‌ప్రెస్

  • న్యూ జల్పాయ్‌గురి – పాట్నా వందేభారత్ ఎక్స్‌ప్రెస్

  • న్యూ జల్పాయ్‌గురి – గౌహతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్

కేవలం 2 గంటల్లో ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారం

ఈ కొత్త వ్యవస్థలో ప్రయాణికుల సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ప్రయాణంలో నీటి లభ్యత, వాష్‌రూమ్ మెయింటెనెన్స్, క్లీనింగ్ వంటి అంశాలపై రైలులోనే ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను అత్యంత వేగంగా పరిష్కరించేందుకు 'రెండు గంటల గడువు' (2-Hour Target) నిబంధనను తీసుకువచ్చారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా ఫిర్యాదు పరిష్కారం కాకపోతే, ఆటోమేటిక్‌గా ఆయా ఉన్నతాధికారులకు సమస్య వెళ్లేలా డిజిటల్ ఎస్కలేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

ఏఐ (AI) ఆధారిత పర్యవేక్షణ & డిజిటల్ ట్రాకింగ్

రైళ్లలో హౌస్‌కీపింగ్ పనులను మెరుగుపరిచేందుకు అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నారు. ఇందులో భాగంగా జియో-ట్యాగ్డ్ వెరిఫికేషన్, స్టాఫ్ మూవ్‌మెంట్ ట్రాకింగ్ మరియు సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చాయి. రైలులోని వివిధ ప్రాంతాల పరిశుభ్రతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ద్వారా అంచనా వేసి, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దేలా ప్లాన్ చేశారు. అలాగే ప్రయాణికులు తమ నిజసమయ అభిప్రాయాలను (Real-time feedback) స్టార్ రేటింగ్స్ ద్వారా తెలియజేసే సదుపాయం కల్పించారు.

ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట

కోచ్‌ల నిర్వహణ, ఏసీ విండోల శుభ్రత, వ్యర్థాల సరైన తొలగింపు, బెడ్ లినెన్స్ (దుప్పట్లు, బెడ్‌షీట్లు) సకాలంలో పంపిణీ చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సేవలను అందించడం ద్వారా ఇండియన్ రైల్వేస్ ప్రయాణాన్ని విమానయాన ప్రయాణాలతో సమానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

Tags

Be the first to react

Latest