Instagram issues: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఇన్‌స్టా సేవలు.. వేలల్లో ఫిర్యాదులు! తమ చాట్ మెసేజ్‌లు..

Instagram issues: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవాళ‌ ఉదయం నుంచి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్‌లు (డీఎంలు) యాక్సెస్ చేయలేకపోతున్నామని, చాట్ థీమ్‌లు మాయమయ్యాయని ఫిర్యాదులు చేస్తున్నారు.

Instagram issues: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఇన్‌స్టా సేవలు.. వేలల్లో ఫిర్యాదులు! తమ చాట్ మెసేజ్‌లు..
  • అమెరికా, భారత్ సహా పలు దేశాల్లో వినియోగదారుల ఇబ్బందులు…
     
  • ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం..

Instagram issues: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవాళ‌ ఉదయం నుంచి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్‌లు (డీఎంలు) యాక్సెస్ చేయలేకపోతున్నామని, చాట్ థీమ్‌లు మాయమయ్యాయని ఫిర్యాదులు చేస్తున్నారు. సెర్చ్ టూల్ కూడా పనిచేయడం లేదని, కాంటాక్ట్స్ కనిపించడం లేదని ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా నెటిజన్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కొత్త మెసేజ్‌లు వస్తున్నట్లు నోటిఫికేషన్లు కనిపిస్తున్నప్పటికీ, తీరా యాప్ తెరిచి చూస్తే మెసేజ్‌ల పేజీ మొత్తం ఖాళీగా కనిపిస్తోందని ఒక యూజర్ పేర్కొన్నారు. యాప్ మొత్తం విరిగిపోయినట్టుగా ఉందంటూ మరికొందరు యూజర్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ (DownDetector) గణాంకాల ప్రకారం, బుధవారం ఉదయం నాటికి 10,000కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదులలో అత్యధికంగా అమెరికా నుంచి రాగా, భారత్‌లో కూడా వందల సంఖ్యలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కంప్లైంట్లు ఇచ్చారు. డౌన్‌డిటెక్టర్‌కు అందిన మొత్తం ఫిర్యాదుల్లో 71 శాతం యాప్ యాక్సెస్‌కు సంబంధించినవి కాగా, 19 శాతం సర్వర్ కనెక్షన్‌కు, 5 శాతం ఫీడ్ లేదా టైమ్‌లైన్‌కు సంబంధించిన సమస్యలని వెల్లడైంది. వినియోగదారులు సమర్పించిన సమాచారం ఆధారంగానే ఈ గణాంకాలు ఉంటాయి కాబట్టి, అసలు ప్రభావితమైన వారి సంఖ్య అంతకంటే ఎక్కువే ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ భారీ అంతరాయంపై ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం మెటా (Meta) నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి వివరణ లేదా ప్రకటన వెలువడలేదు.

Be the first to react

Latest