LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Technology

Bajaj vs TVS: బజాజ్ పల్సర్ vs టీవీఎస్ అపాచీ..180cc బైకుల్లో ఏది బెస్ట్?

Bajaj vs TVS: బజాజ్ పల్సర్ 180 మళ్లీ మార్కెట్లోకి వచ్చింది. టీవీఎస్ అపాచీ 180తో పోలిస్తే ఈ రెండింటిలో ఏది మెరుగైనదో, దేని ధర ఎంత ఉందో..

AndhraPravasi News Desk 2 min read
Bajaj vs TVS: బజాజ్ పల్సర్ vs టీవీఎస్ అపాచీ..180cc బైకుల్లో ఏది బెస్ట్?

Bajaj vs TVS: టూ-వీలర్ మార్కెట్‌లో 180cc బైక్‌లకు ఎప్పుడూ ఒక క్రేజ్ ఉంటుంది. అటు మైలేజ్, ఇటు పెర్ఫార్మెన్స్ రెండూ కావాలనుకునే కుర్రాళ్ల కోసం బజాజ్ తన ఐకానిక్ మోడల్ 'పల్సర్ 180'ని మళ్ళీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే, దీనికి గట్టి పోటీగా టీవీఎస్ అపాచీ RTR 180 నిలబడింది. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఇప్పుడు చూద్దాం.

 ఇంజిన్ పవర్ దేని జోరు ఎంత?

ముందుగా ఇంజిన్ విషయానికి వస్తే, రెండూ దాదాపు ఒకే స్థాయి శక్తిని కలిగి ఉన్నాయి. పల్సర్ 180 ఇంజిన్ 17 హెచ్‌పి పవర్‌ని ఇస్తుంది. అపాచీ కూడా అంతే పవర్‌ని ఇస్తున్నప్పటికీ, టార్క్ (Torque) విషయంలో అపాచీ కొంచెం ముందుంది. అంటే, సిటీ ట్రాఫిక్‌లో పల్సర్ చాలా స్మూత్‌గా సాగిపోతుంటే, అపాచీ మాత్రం కాస్త వేగంగా  దూసుకుపోతుంది. మీరు లాంగ్ రైడ్స్ వెళ్లేవారైతే పల్సర్ సౌకర్యంగా ఉంటుంది, అదే స్పీడ్‌ని ఇష్టపడే వారైతే అపాచీ నచ్చుతుంది.

 బరువు  హ్యాండ్లింగ్

ఈ రెండు బైకుల మధ్య ప్రధాన తేడా వాటి బరువులోనే ఉంది. అపాచీ RTR 180 బరువు కేవలం 140 కిలోలు మాత్రమే. పల్సర్‌తో పోలిస్తే ఇది 16 కిలోలు తక్కువ. దీనివల్ల ట్రాఫిక్‌లో బైక్‌ను తిప్పడం, సందుల్లో నుంచి తీసుకెళ్లడం అపాచీతో చాలా తేలిక. అంతేకాకుండా, అపాచీ గ్రౌండ్ క్లియరెన్స్ (180mm) ఎక్కువగా ఉండటం వల్ల స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఇబ్బంది ఉండదు. అయితే, పల్సర్‌లో 15 లీటర్ల పెద్ద పెట్రోల్ ట్యాంక్ ఉండటం ప్లస్ పాయింట్. ఒకసారి ఫుల్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.

 ఫీచర్లు ఏది స్మార్ట్?

టెక్నాలజీ విషయంలో అపాచీ ఒక అడుగు ముందే ఉంది. ఇందులో మూడు రకాల రైడింగ్ మోడ్స్ (స్పోర్ట్, అర్బన్, రెయిన్) ఉన్నాయి. వర్షం పడినప్పుడు లేదా సిటీలో వెళ్తున్నప్పుడు ఈ మోడ్స్ చాలా ఉపయోగపడతాయి. అలాగే దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. పల్సర్ 180 కూడా ఇప్పుడు డిజిటల్ మీటర్, ఎల్‌ఈడీ లైట్లతో కొత్తగా కనిపిస్తున్నప్పటికీ, ఫీచర్ల పరంగా అపాచీనే టాప్ అని చెప్పాలి. ముఖ్యంగా అపాచీలో ఉన్న 'గ్లైడ్ త్రూ టెక్నాలజీ' ట్రాఫిక్‌లో క్లచ్ వదలకుండా బైక్ మెల్లగా వెళ్లేలా చేస్తుంది.

 ధర ఎంత

ధర విషయానికి వస్తే, బజాజ్ పల్సర్ 180 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.22 లక్షలుగా ఉంది. ఇక టీవీఎస్ అపాచీ RTR 180 ధర రూ. 1.26 లక్షలు. అంటే పల్సర్ కంటే అపాచీ ఒక నాలుగు వేలు ఎక్కువ.  మీరు తక్కువ ధరలో, మంచి కంఫర్ట్  ఎక్కువ పెట్రోల్ పట్టే ట్యాంక్ కావాలనుకుంటే బజాజ్ పల్సర్ 180 కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. అలా కాకుండా, మీకు బైక్ చూడటానికి స్టైలిష్‌గా ఉండాలి, బరువు తక్కువగా ఉండాలి  లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లు కావాలి అనుకుంటే  టీవీఎస్ అపాచీ RTR 180 మీకు సరైన ఛాయిస్. మొత్తానికి ఈ 180cc వార్‌లో ఫీచర్ల పరంగా అపాచీ మెరిసిపోతుంటే, నమ్మకం  బడ్జెట్ పరంగా పల్సర్ గట్టి పోటీ ఇస్తోంది.

Be the first to react

More Coverage

6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!

6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!

6G Network: భారతదేశంలో 5G విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న 6G నెట్‌వర్క్ ప్రణాళి…