తెలుగు భాషలో భలే విచిత్రాలు.. ట్రాఫిక్ జామ్ ఉంటుంది.. ట్రాఫిక్ బ్రెడ్? నవ్వులు పూయిస్తున్న పదాల సరదా!

Funny Telugu Language Facts: తెలుగు భాషలో ఎన్నో ప్రత్యేకతలు, వింతలు, విశేషాలు ఉన్నాయి. కొన్ని పదాలను గమనిస్తే వాటి వెనుక ఉన్న అర్థాలు ఆసక్తిని కలిగిస్తాయి. మరికొన్ని పదాలను పోల్చి చూస్తే నవ్వు ఆగదు. ఇలాంటి ఆసక్తికరమైన తెలుగు పదాలపై రూపొందించిన ఓ సరదా సందేశం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.

Funny and Interesting Word Combinations in Telugu
Funny and Interesting Word Combinations in Telugu
  • తెలుగు భాషలో రోజూ ఉపయోగించే పదాల్లోనే ఎన్నో ఆసక్తికరమైన వింతలు దాగి ఉన్నాయి.
  • నెలవంక అనే పదం ఉన్నప్పటికీ వారం వంక అనే పదం లేకపోవడం సరదాగా ప్రస్తావించారు.

Funny Telugu Language Facts: తెలుగు భాషలో ఎన్నో ప్రత్యేకతలు, వింతలు, విశేషాలు ఉన్నాయి. కొన్ని పదాలను గమనిస్తే వాటి వెనుక ఉన్న అర్థాలు ఆసక్తిని కలిగిస్తాయి. మరికొన్ని పదాలను పోల్చి చూస్తే నవ్వు ఆగదు. ఇలాంటి ఆసక్తికరమైన తెలుగు పదాలపై రూపొందించిన ఓ సరదా సందేశం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.

పదాల్లో భలే విచిత్రాలు!

తెలుగులో నెలవంక అనే పదం ఉంది. కానీ వారం వంక అనే పదం లేదు. అలాగే పాలపుంత ఉందిగానీ, పెరుగుపుంత లేదు. పలకరింపు అనే పదం ఉంది కానీ పుస్తకంరింపు అనే పదం వినిపించదు. పిల్లకాలువ అంటాం కానీ పిల్లోడి కాలువ అనం. ఇలా రోజూ ఉపయోగించే పదాల్లోనే ఎన్నో చిత్రమైన పోలికలు కనిపిస్తాయి.

పదాల వెనుక దాగున్న వింతలెన్నో!

పామాయిల్ ఉంటుంది కానీ తేలు ఆయిల్ ఉండదు. కారుమబ్బులు ఉంటాయి కానీ బస్సు మబ్బులు ఉండవు. ట్యూబ్‌లైట్ ఉంటుంది కానీ టైర్‌లైట్ ఉండదు. ట్రాఫిక్ జామ్ అంటాం కానీ ట్రాఫిక్ బ్రెడ్ అనం. వడదెబ్బ ఉంటుంది కానీ ఇడ్లీ దెబ్బ ఉండదు. నిద్రగన్నేరు చెట్టు ఉంటుంది కానీ మెలకువ గన్నేరు చెట్టు ఉండదంటూ ఈ సరదా పోలికలు నవ్వులు పూయిస్తున్నాయి.

పేరులో ఒకటి.. లోపల మరొకటి!

ఇక కొన్ని పదాల పేర్లను పరిశీలిస్తే మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఫైర్ స్టేషన్‌లో ఫైర్ ఉండదు. పులిహారలో పులి ఉండదు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. మైసూర్ పాక్‌లో మైసూర్ కనిపించదు. గాలిపటంలో గాలి ఉండదు. గల్లాపెట్టెలో గల్లా ఉండదు. ఇలా పదాల పేర్లకు, వాటి అసలు అర్థాలకు మధ్య ఉన్న తేడాలను చమత్కారంగా ప్రస్తావించారు.

సోషల్ మీడియా పేర్లపైనా సెటైర్లు!

చివరగా సోషల్ మీడియా వేదికల పేర్లను కూడా వదలకుండా సరదాగా వ్యాఖ్యానించారు. ఫేస్‌బుక్‌లో పుస్తకం ఉండదు.. యూట్యూబ్‌లో గొట్టం ఉండదు అంటూ చమత్కరించారు. ఇలాంటి పదాల గారడీతో కూడిన సందేశం చదివినవారికి నవ్వులు తెప్పిస్తోంది.

మొత్తానికి తెలుగు భాషలోని పదాల ప్రత్యేకతలను హాస్యభరితంగా వివరిస్తూ రూపొందించిన ఈ సందేశం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నవ్వు మనసుకు ప్రశాంతతను ఇస్తుందనే విషయాన్ని గుర్తుచేస్తూ ఈ సరదా పోస్టు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Tags

Be the first to react

Latest