'మురసు' తుపాను ఎఫెక్ట్.. రెండు రిజర్వాయర్లకు వరద హెచ్చరిక!
అమరావతి: మురసు తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జలవనరుల శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా సాగర్ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉండటంతో గుండ్లకమ్మ, రాళ్లపాడు రిజర్వాయర్లకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.
- మురసు తుపాను నేపథ్యంలో గుండ్లకమ్మ, రాళ్లపాడు రిజర్వాయర్లకు వరద ముప్పు పొంచి ఉంది.
- సాగర్ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
అమరావతి: మురసు తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జలవనరుల శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా సాగర్ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉండటంతో గుండ్లకమ్మ, రాళ్లపాడు రిజర్వాయర్లకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావం, రిజర్వాయర్లకు వచ్చే వరద ప్రవాహాలపై సమీక్షించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే రెవెన్యూ, పోలీస్, ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తుపాను ప్రభావంతో వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.
Be the first to react
