జగన్ పార్టీ గుర్తింపుకే ఎసరు.. ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు!

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌తో పాటు వైసీపీ నేతలు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

Varla Ramaiah Complaint to ECI on YSRCP
Varla Ramaiah Complaint to ECI on YSRCP
  • వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వర్ల రామయ్య విజ్ఞప్తి.
  • జగన్, వైసీపీ నేతల వ్యాఖ్యలు ప్రజలను, పోలీసులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆరోపణ.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌తో పాటు వైసీపీ నేతలు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ చేయడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం లక్ష్యంగా పనిచేయాలని వర్ల రామయ్య పేర్కొన్నారు. అయితే వైసీపీ తీరు అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. నైతిక విలువలు లేని రాజకీయాలకు జగన్ నాయకత్వం వహిస్తున్నారని, వైసీపీ రాజకీయ పార్టీలా కాకుండా అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో పులివెందులకు వస్తానని, చేతులు మడతపెడతానని జగన్ చేసిన వ్యాఖ్యలపై వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలతో ప్రజలను, పోలీసులను భయభ్రాంతులకు గురిచేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడటం బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడి లక్షణం కాదని వ్యాఖ్యానించారు.

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాష్ట్రం విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన అంశంపైనా జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం, కల్తీ మద్యం సరఫరా, తిరుమల లడ్డూ కల్తీ వంటి వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులను ప్రస్తావిస్తూ.. అలాంటి పరిణామాల తర్వాత కూడా వైసీపీని రాజకీయ పార్టీగా ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు.

వైసీపీ నేతలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి రోజా, ఎంపీ అవినాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పోలీసులను భయపెట్టే విధంగా ఉన్నాయని వర్ల రామయ్య ఆరోపించారు. పార్టీ అధినేతగా ఈ వ్యాఖ్యలకు జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

తల్లి, చెల్లితో జగన్ వ్యవహరిస్తున్న తీరుపైనా వర్ల రామయ్య వ్యక్తిగత విమర్శలు చేశారు. నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని వ్యాఖ్యానించారు. జగన్, వైసీపీ నేతల ప్రసంగాలు, వీడియోలు, పత్రికా కథనాలను పరిశీలించి పార్టీ గుర్తింపును రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

Tags

Be the first to react

Latest