జడ్పీటీసీ బరిలో రూ.172 కోట్ల ఆస్తుల అభ్యర్థి!
చిత్తూరు: గుడిపాల మండలం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మమత శ్రీ కుటుంబ ఆస్తుల విలువ రూ.172.27 కోట్లుగా వెల్లడైంది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె ఈ వివరాలను పొందుపరిచారు. ఇందులో రూ.9.28 కోట్ల చరాస్తులు, రూ.162.99 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
- గుడిపాల జడ్పీటీసీ తెదేపా అభ్యర్థి మమత శ్రీ కుటుంబ ఆస్తులు రూ.172.27 కోట్లు.
- రూ.9.28 కోట్ల చరాస్తులు, రూ.162.99 కోట్ల స్థిరాస్తులు.
చిత్తూరు: గుడిపాల మండలం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మమత శ్రీ కుటుంబ ఆస్తుల విలువ రూ.172.27 కోట్లుగా వెల్లడైంది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె ఈ వివరాలను పొందుపరిచారు. ఇందులో రూ.9.28 కోట్ల చరాస్తులు, రూ.162.99 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
అఫిడవిట్ ప్రకారం.. మమత శ్రీ పేరిట రెండు స్కూటీలు, 1.10 కిలోల బంగారం, 15 కిలోల వెండి ఉన్నాయి. ఆమె భర్త మొగిలీశ్వర నాయుడు (ఈశ్వర నాయుడు) పేరిట మూడు సరకు రవాణా వాహనాలు, మూడు కాంక్రీట్ మిక్సర్ ట్రక్కులు ఉన్నాయి.
స్థిరాస్తుల విషయానికొస్తే.. ఈశ్వర నాయుడు పేరిట రూ.119.80 కోట్ల విలువైన ఆస్తులు, మమత శ్రీ పేరిట రూ.43.64 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీటిలో 44.62 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు రూ.24.89 కోట్ల విలువైన నివాస గృహాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంతో పాటు కర్ణాటకలోనూ వీరికి ఆస్తులున్నట్లు వెల్లడించారు.
ఇక భార్యాభర్తలిద్దరి పేరిట కలిపి రూ.32 కోట్ల మేర రుణాలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వివరించారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి కుటుంబ ఆర్థిక నేపథ్యం ఈ ఆస్తుల వివరాలతో చర్చనీయాంశంగా మారింది.
Be the first to react