జగన్ నరకం నుండి తప్పిపోయిన రాక్షసుడు! సొంత వాళ్లే రియలైజేషన్!

Local Body Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధిస్తున్న రికార్డు స్థాయి ఏకగ్రీవాలపై వైఎస్సార్‌సీపీలో తీవ్ర అంతర్గత సంక్షోభం తలెత్తింది. ఒక్క ఏకగ్రీవం జరిగినా భవిష్యత్తులో టికెట్లు ఇచ్చేది లేదని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీసేందుకు పార్టీ ముఖ్య సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహించిన సమీక్షల్లో నేతల నుంచి దిమ్మతిరిగే సమాధానాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా పార్టీకి కంచుకోటలైన పులివెందుల, పుంగనూరుల్లోనే అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి కుటుంబాల లాంటి అగ్ర నేతలు టీడీపీతో అంతర్గత రాజీకి వచ్చినప్పుడు, ఏ ఆధారం లేని సాధారణ కేడర్ కూటమి ప్రభుత్వంతో ఘర్షణ పడి కేసులు, దెబ్బలు ఎందుకు భరించాలని ద్వితీయ శ్రేణి నాయకులు నేరుగా సజ్జలనే నిలదీశారు.

జగన్ నరకం నుండి తప్పిపోయిన రాక్షసుడు
జగన్ నరకం నుండి తప్పిపోయిన రాక్షసుడు
  • వైఎస్సార్‌సీపీలో అంతర్గత ముసలం: స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్‌కు సొంతవాళ్ల వెన్నుపోటు!

  • సజ్జల రామకృష్ణారెడ్డికి దిమ్మతిరిగే షాక్: నేతలను ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగిన వైనం!

  • "ముందు మీ సొంతవాళ్లను అడగండి.. ఆ తర్వాత మాదాకా రండి": సజ్జల ముందే నేతల కుండబద్దలు!

Politics: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు సాధిస్తుండటంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క స్థానం ఏకగ్రీవమైనా భవిష్యత్తులో వారికి పార్టీ టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది, టీడీపీ నాయకులతో మనవాళ్లు ఎందుకు అంతర్గత అవగాహనకు వస్తున్నారనే విషయాన్ని ఆరా తీసే బాధ్యతను పార్టీ ముఖ్య సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. అయితే వివిధ జిల్లాల నేతలతో మాట్లాడి గ్రౌండ్ రియాలిటీని తెలుసుకునేందుకు ప్రయత్నించిన సజ్జలకు క్షేత్రస్థాయి క్యాడర్ నుంచి దిమ్మతిరిగే సమాధానాలు ఎదురయ్యాయి.

సొంతవాళ్లే దెబ్బేశారంటూ నేతల ఎదురుదాడి

సజ్జల రామకృష్ణారెడ్డి స్థానిక నేతలను నిలదీయగా, వారు ఏమాత్రం వెనుకాడకుండా అధిష్టానం తీరుపైనే నేరుగా ఎదురుదాడికి దిగారు. "మీ సొంతవాళ్లే మీకు దెబ్బేశారు.. పార్టీ కోసం నిలబడిన మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారు? ముందు వాళ్ల సంగతి తేల్చండి, ఆ తర్వాత మా దాకా రండి" అంటూ కుండబద్దలు కొట్టినట్లు సమాధానమిచ్చారు. గతంలో 2021 స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికార బలంతో ఏకగ్రీవాల సంస్కృతిని తెరపైకి తెచ్చిందని, ఇప్పుడు అదే విద్యను కూటమి నేతలు తమపై ప్రయోగిస్తుంటే తాము ఎదుర్కొని దెబ్బలు తినలేమని నేతలు నిర్మొహమాటంగా స్పష్టం చేశారు.

పుంగనూరు, పులివెందుల నియోజకవర్గాల్లో రాజీపై నిలదీత

ముఖ్యంగా వైఎస్సార్‌సీపీకి కంచుకోటలుగా పేరుగాంచిన పుంగనూరు, పులివెందుల నియోజకవర్గాల్లోనే స్థానిక సంస్థల స్థానాలు ఎలా ఏకగ్రీవమయ్యాయనే ప్రధాన విషయాన్ని నేతలు సజ్జల వద్ద లేవనెత్తారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి.. పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వంటి బలమైన నాయకులు ఉండి కూడా అక్కడ ఎందుకు రాజీ పడ్డారని ప్రశ్నించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు గనులు, కాంట్రాక్టులు చేసుకుంటూ వేల కోట్లు సంపాదించిన ఆ బడా నేతలే టీడీపీతో రహస్య అవగాహన కుదుర్చుకుంటుంటే, ఏ ఆధారం లేని తాము ప్రభుత్వం చేతిలో ఎందుకు కేసులు ఎదుర్కోవాలని ద్వితీయ శ్రేణి నేతలు ప్రశ్నించారు.

లోకేష్ వ్యూహాత్మక రాజకీయం – తట్టుకోలేని క్యాడర్

గతంలో టీడీపీ చూసీచూడనట్లు మెతక వైఖరితో ఉండేదని, కానీ ఇప్పుడు కూటమిలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని నేతలు విశ్లేషించారు. నారా లోకేష్ జగన్‌ను మించిన దూకుడుతో రాజకీయం చేస్తున్నారని, కొట్టాల్సిన చోట కొడుతూ, పెట్టాల్సిన చోట పెడుతూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అధికారం వచ్చినప్పుడు లాభాలన్నీ పెద్ద లీడర్ల కోటరీకే దక్కుతున్నప్పుడు, తాము కూటమి దెబ్బలు తింటూ రాజకీయంగా భూస్థాపితం అవ్వడానికి సిద్ధంగా లేమని, అందుకే తమ రాజకీయ మనుగడ కోసం టీడీపీ నాయకులతో అవగాహనకు మొగ్గు చూపుతున్నామని వెల్లడించారు.

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా పార్టీ ఉనికికి గండం

ఈ రాజీ ధోరణి కేవలం ఒకట్రెండు ప్రాంతాలకే పరిమితం కాలేదని, ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని కోస్తా, రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం దాకా అంతటా ఇదే పరిస్థితి నెలకొందని తేలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే నాయకులు ఈ స్థాయిలో టీడీపీతో చేతులు కలిపితే, రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి వైఎస్సార్‌సీపీ తరఫున నిలబడి పోరాడే నాథుడే ఉండడని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్గత అవగాహనలతో అగ్రనేతలు తమ ఆస్తులను కాపాడుకుంటుంటే, క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికి కోల్పోతోందన్న ఈ అంతర్గత లీకులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

Tags

Be the first to react

Latest