సెమీకాన్ ఇండియా-2026 ప్రారంభం.. భారత్‌ను సెమీకండక్టర్ హబ్‌గా మార్చడమే లక్ష్యం: ప్రధాని మోదీ

Semicon India 2026: ఢిల్లీలోని యశోభూమిలో సెమీకాన్ ఇండియా-2026 సదస్సు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు “సిలికాన్ టు సిస్టమ్స్” అనే థీమ్‌ను ఖరారు చేశారు. భారత్‌లో సెమీకండక్టర్ తయారీ, చిప్ డిజైన్, పెట్టుబడులు, యువత నైపుణ్యాభివృద్ధిపై సదస్సులో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

సెమీకాన్ ఇండియా-2026 ప్రారంభం.. భారత్‌ను సెమీకండక్టర్ హబ్‌గా మార్చడమే లక్ష్యం.
సెమీకాన్ ఇండియా-2026 ప్రారంభం.. భారత్‌ను సెమీకండక్టర్ హబ్‌గా మార్చడమే లక్ష్యం.

ఢిల్లీలో ప్రారంభమైన సెమీకాన్ ఇండియా-2026

యశోభూమిలో సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ

మూడు రోజుల పాటు కొనసాగనున్న సెమీకాన్-2026

సిలికాన్ టు సిస్టమ్స్” థీమ్‌తో సదస్సు

భారత్‌లో సెమీకండక్టర్ పెట్టుబడులపై ప్రధాన ఫోకస్

సెమీకండక్టర్ రంగంలో భారత్ రెండో దశకు చేరిందన్న ప్రధాని

చిప్ డిజైన్ కోసం యువత నైపుణ్యాలను పెంచుకుంటోందని వెల్లడి

భారత్‌లో తయారైన చిప్‌లు ప్రపంచానికి చేరువవుతున్నాయని వ్యాఖ్య

భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని స్పష్టం

మైక్రో చిప్స్ జర్నీ” ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ఢిల్లీలోని యశోభూమిలో సెమీకాన్ ఇండియా-2026 సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు “సిలికాన్ టు సిస్టమ్స్” అనే థీమ్‌ను ఖరారు చేశారు.

భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమను మరింత బలోపేతం చేయడం, చిప్ తయారీ మరియు డిజైన్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా ఉంది. ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించే దిశగా సదస్సులో చర్చలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్‌లో సెమీకండక్టర్ల రంగం రెండో దశకు చేరుకుందని తెలిపారు. ప్రపంచంలోని ఇతర దేశాలు సాధించడానికి పదేళ్లు పట్టిన పురోగతిని భారత్ నాలుగేళ్లలోనే సాధించిందని పేర్కొన్నారు.

చిప్ డిజైన్ రంగంలో యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించే దిశగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధాని తెలిపారు. భారత్‌లో తయారవుతున్న చిప్‌లు ప్రపంచ మార్కెట్లకు చేరువవుతున్నాయని చెప్పారు.

ప్రపంచం ఊహించిన దానికంటే భారత్ వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్న ప్రధాని మోదీ.. భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ఇటీవల నమోదైన 7.8 శాతం జీడీపీ వృద్ధిని కూడా ప్రధాని ప్రస్తావించారు. బ్రిక్స్ సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంతో ప్రపంచ దేశాలకు భారత్‌పై నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు.

సెమీకండక్టర్ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ ప్రధాని మోదీ  “మైక్రో చిప్స్ జర్నీ” ని ఆవిష్కరించారు. సెమీకాన్ ఇండియా-2026లో దేశీయ చిప్ తయారీ, డిజైన్, పెట్టుబడులు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.

Tags

Be the first to react

Latest