విజయవాడ: గత 10 ఏళ్లలో అభివృద్ధి జరగలేదని.. అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీల వల్లే ఏపీలో భూతద్దం పెట్టి చూసినా డెవలప్ మెంట్ కనిపించడం లేదని... రాజధాని అమరావతిని సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు చివరికి 3D గ్రాఫిక్స్ చూపించారని సెటైర్లు వేశారు.
జగన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్పి.. ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారంటూ మండిపడ్డారు. రాజధాని ఏది అంటే మనకే తెలియదు, ఇదేనా సాధించిన అభివృద్ధి అని ప్రశ్నించారు. విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యలు చేపట్టారు. గిడుగు రుద్రరాజు PCC నియామక పత్రాలను షర్మిలకు అందించారు. భాద్యతల స్వీకరణలో ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్ నేతలు పలువురు పాల్గొన్నారు.
దివంగత నేత YSR రెండు సార్లు ఆంధ్ర ప్రదేశ్ కి PCCగా పనిచేశారు. రెండు సార్లు YSR ముఖ్యమంత్రిగా గెలిచారు. నేడు అదే PCC పదవిని.. వైఎస్సార్ బిడ్డను నమ్మి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నమ్మి ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇంత నమ్మకాన్ని నాపై ఉంచినందుకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తున్న. రాష్ట్రానికి చెందిన నాయకులు, క్యాడర్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు’ వైఎస్ షర్మిల.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
హోదా పక్కన పెట్టీ ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇక జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం రోజు హోదా అన్నారు.. కేంద్రంపై అవిశ్వాసం పెడతా అన్నారని గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదాపై, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారి కూడా ఉద్యమం చేయలేదని విమర్శించారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ తాకట్టు పెట్టిందని, ప్రత్యేక హోదా కాదు కదా.. కనీసం ఒక్క ప్యాకేజీ కూడా లేదన్నారు. .
రాష్ట్రం నెత్తిన 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి కానీ బూతద్దం పెట్టి చూసినా అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు.
రాజధాని ఉందా..? రాజధాని కట్టగలిగారా ? ఇతర రాష్ట్రాలకు మెట్రో ఉందని.. ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క మెట్రో కూడా లేదన్నారు... పరిశ్రమలు లేవు... ఆంధ్రలో రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేవు. మరోవైపు అభివృద్ధి లేదు కానీ.. దళితులపై దాడులు మాత్రం 100 శాతం పెరిగాయంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా.. దోచుకోవడం దాచుకోవడం ఇదే పనిగా మారిందన్నారు.
‘ప్రత్యేక హోదా హామీ ఇచ్చి 10 ఏళ్లు అయ్యింది, కానీ హోదా మాత్రం రాలేదు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలేదు? వాళ్లకు చేతకాలేదు... విభజన సమయంలో కాంగ్రెస్ 5 ఏళ్లు హోదా ఇస్తామని అంటే బీజేపీ 10 ఏళ్లు ఇవ్వాలని ఊదర గొట్టారు. కానీ ఏపీకి అన్యాయం చేశారు’ అని రాష్ట్ర ప్రభుత్వంపై, కేంద్రంపై షర్మిల విమర్శలు గుప్పించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి