⚡ BREAKING
NRI

TANA: విద్యార్థుల విద్యాభివృద్ధికి తానా, SATVIINSPIRE ఫౌండేషన్ సహకారం.. ప్రభుత్వ పాఠశాలలో హోంవర్క్ డైరీల పంపిణీ!

TANA: విద్యార్థులలో క్రమశిక్షణ, బాధ్యతాభావం పెంపొందించడంతో పాటు చదువులో పురోగతికి తోడ్పడే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడి ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

TANA
TANA

తెనుగుపూడి ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రోత్సాహ కార్యక్రమం.. విద్యార్థులకు హోంవర్క్ డైరీలు..

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తానా అండ.. హోంవర్క్ డైరీల పంపిణీ..

అనకాపల్లి: విద్యార్థులలో క్రమశిక్షణ, బాధ్యతాభావం పెంపొందించడంతో పాటు చదువులో పురోగతికి తోడ్పడే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడి ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

SATVIINSPIRE ఫౌండేషన్ మరియు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు హోంవర్క్ డైరీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చి. శ్రీచరణి మేకా స్పాన్సర్‌గా వ్యవహరించగా, తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ చౌదరి మేకా కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

హోంవర్క్ డైరీలు విద్యార్థులు ప్రతిరోజూ చేసే చదువు, హోంవర్క్, పాఠశాల కార్యక్రమాలను నమోదు చేసుకునేందుకు ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతిని సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సమయపాలన, క్రమశిక్షణ, బాధ్యత వంటి మంచి లక్షణాలను పెంచడంలో ఈ డైరీలు సహాయపడతాయని చెప్పారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.ఎస్.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఇలాంటి ఉపయోగకరమైన కార్యక్రమం చేపట్టిన తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేకా, తానా సభ్యులు, SATVIINSPIRE ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు అందించిన సహకారాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ పెద్దాడ వెంకటరమణ, శ్రీనివాసరావు, మహేశ్వరరావు, కొండమ్మ, త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ విజయవంతానికి తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రసాద్ నల్లూరి, తానా బోర్డు చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, తానా న్యూజెర్సీ బృందం మార్గదర్శకత్వం, సహకారం అందించారు.

ఈ సందర్భంగా SATVIINSPIRE ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి విద్యా సహాయ కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Tags

Be the first to react

More Coverage