⚡ BREAKING
NRI

TANA: నాన్నతో నడక.. తండ్రి ప్రేమను గుర్తు చేసిన తానా మిడ్ అట్లాంటిక్ వేడుక!

TANA: తండ్రి ప్రేమ, అనుబంధం, త్యాగాలను గుర్తుచేసేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో “నాన్నతో నడక” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫాదర్స్ డే సందర్భంగా పెన్సిల్వేనియాలోని వ్యాలీ ఫోర్జ్ నేషనల్ హిస్టారికల్ పార్క్‌లో నిర్వహించిన ఈ వేడుక తండ్రులు, పిల్లలకు మధుర జ్ఞాపకంగా నిలిచింది.

TANA Walk With Father
TANA Walk With Father

ఫాదర్స్ డే సందర్భంగా పెన్సిల్వేనియాలో ప్రత్యేక కార్యక్రమం.. 200 మందికి పైగా తండ్రులు, పిల్లల సందడి..

నాన్నతో గడిపిన క్షణాలకు గుర్తుగా.. పెన్సిల్వేనియాలో తానా ప్రత్యేక వేడుక..

పెన్సిల్వేనియా: తండ్రి ప్రేమ, అనుబంధం, త్యాగాలను గుర్తుచేసేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో “నాన్నతో నడక” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫాదర్స్ డే సందర్భంగా పెన్సిల్వేనియాలోని వ్యాలీ ఫోర్జ్ నేషనల్ హిస్టారికల్ పార్క్‌లో నిర్వహించిన ఈ వేడుక తండ్రులు, పిల్లలకు మధుర జ్ఞాపకంగా నిలిచింది.

తానా మిడ్ అట్లాంటిక్ నిర్వహించిన ఈ కార్యక్రమం 40వ ప్రత్యేక వేడుకగా నిలిచింది. జూలై 2025 నుంచి వరుసగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తానా మిడ్ అట్లాంటిక్ ఈసారి తండ్రి-పిల్లల అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, తానా మిడ్ అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి పాల్గొన్నారు. కార్యక్రమానికి సూచనలు, మార్గదర్శకత్వం అందించిన తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు కూడా హాజరయ్యారు.

ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్ర ఎంతో గొప్పదని ఆయన తన ప్రసంగంలో వివరించారు. తండ్రుల ప్రేమ, మార్గదర్శకత్వం, కుటుంబానికి వారు అందించే విలువలను ఆయన గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సుమన్ తండ్రులు, పిల్లలతో కలిసి ఫొటోలు దిగుతూ కార్యక్రమంలో ఉత్సాహాన్ని నింపారు.

సాయంత్రం కార్యక్రమంలో మిమిక్రీ రమేష్ తన పాటలు, వినోదభరిత ప్రదర్శనలతో అందరినీ అలరించారు. అలాగే మఖ్దూమ్ సయ్యద్, ఉమాకాంత్ అందించిన స్ఫూర్తిదాయక ప్రసంగాలు కార్యక్రమానికి మరింత అర్థాన్ని చేకూర్చాయి.

ఈ వేడుకలో దాదాపు 200 మందికి పైగా తండ్రులు, వారి పిల్లలు పాల్గొని ఆనందంగా గడిపారు. తండ్రితో కలిసి నడుస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం, కుటుంబ బంధాలను మరింత బలపరిచేలా ఈ కార్యక్రమం సాగింది.

కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన సురేష్ యలమంచికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సహకారం అందించిన సునీల్ కోగంటి, రంజిత్ మామిడి, శ్రీధర్ సాదినేని, దీప్తి కోక, సంతోష్ రౌతు, చలం పావులూరి, కృష్ణ నందమూరి, విశ్వనాథ్ కోగంటి, ప్రసాద్ కస్తూరిలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి సేవలందించిన వాలంటీర్లకు గుర్తింపుగా “వాలంటీర్ సర్వీస్ అవర్ సర్టిఫికేట్లు” అందజేశారు. కార్యక్రమానికి వచ్చిన వారందరికీ భోజన సదుపాయం కల్పించి, ప్రతి ఒక్కరికీ మరపురాని అనుభూతిని అందించారు.

తండ్రి-పిల్లల బంధానికి విలువను చాటుతూ, తెలుగు సమాజంలో కుటుంబ అనుబంధాలను మరింత బలపరిచేలా “నాన్నతో నడక” కార్యక్రమం విజయవంతంగా నిలిచింది.

Tags

Be the first to react

More Coverage