AP Politics: ఉండవల్లి నీ వంకర బుద్ధులు ఆపుకో! ఇకపై నీ అంత నీచ నికృష్టు బుద్ధులతో ప్రజలు మోసపోరు!

AP Politics: మార్గదర్శి సంస్థ డిపాజిటర్లందరికీ రూ. 2596 కోట్లను పైసా బాకీ లేకుండా తిరిగి చెల్లించిందని, హైకోర్టు మరియు సుప్రీంకోర్టుల్లో కేసులు ముగిసినా ఇంకా వివాదం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్బీఐ నిబంధనల పేరిట జరిమానాలు కోరేవారు, గతంలో ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆక్రమించి వెనక్కి ఇచ్చిన రాజకీయ నేతల విషయంలో మౌనంగా ఉండటం స్పష్టమైన ద్వంద్వ నీతిని ప్రతిబింబిస్తోంది.

వైఎస్ చేస్తే ఒప్పు...  రామోజీ చేస్తే తప్పా
వైఎస్ చేస్తే ఒప్పు... రామోజీ చేస్తే తప్పా

ఇడుపులపాయలో వందల ఎకరాలు మింగితే సైలెన్స్! మార్గదర్శిపై మాత్రం మైకుల ముందు రంకెలా?! — ఇదేం న్యాయం వైసీపీ బ్యాచ్?!

వైఎస్ చేస్తే ‘చెట్ల మీద ప్రేమట’! రామోజీ చేస్తే ‘రూల్స్ బ్రేక్’ అంటారా?!— భలే కుదిర్చారయ్యా డబుల్ స్టాండర్డ్స్!

దొంగతనం చేసి వెనక్కిస్తే నేరం కాదన్నప్పుడు!మరి వైఎస్ కుటుంబం చేసింది త్యాగమా?!

Andhrapradesh: మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తుది తీర్పుపై వస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సుప్రీం కోర్టు కేవలం సాంకేతిక (టెక్నికల్) కారణాలతోనే స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసిందని, మార్గదర్శి ఏ తప్పూ చేయలేదని నిర్దారించలేదని కొందరు కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. అయితే, గత రెండు దశాబ్దాలుగా (20 ఏళ్లుగా) మార్గదర్శిపై నడిచిన న్యాయపోరాటమే కేవలం ఆర్బీఐ సెక్షన్ 45S అనే సాంకేతిక నిబంధన ఆధారంగా సాగిందనే వాస్తవాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంది.

ఈ వివాదం మూలాల్లోకి వెళితే, మార్గదర్శి సంస్థ ఎవరికైనా రూపాయి ఎగ్గొట్టిందా లేదా మోసం చేసిందా అనే అంశంపై ఎక్కడా ఫిర్యాదులు లేవు. దాదాపు 2.5 లక్షల మంది డిపాజిటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా తమకు మార్గదర్శి నుంచి రావాల్సిన అసలు గానీ, వడ్డీ గానీ రాలేదని పోలీసుల వద్దకు గానీ, కోర్టుల వద్దకు గానీ వెళ్లలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆర్బీఐ ద్వారా విపరీతమైన ఒత్తిడి తెచ్చి, రూ. 2500 కోట్ల డిపాజిట్లను ఒకేసారి వెనక్కి కట్టేలా పరిస్థితులు సృష్టించినప్పటికీ, సంస్థ పైసా బాకీ లేకుండా డిపాజిటర్లందరికీ చెల్లించి నిలబడింది.

హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు 2008లోనే ఈ వివాదంపై స్పందిస్తూ, డిపాజిటర్లందరికీ డబ్బులు చెల్లించారని, కొత్త డిపాజిట్ల సేకరణ నిలిపివేశారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఆ తర్వాత రాజకీయ మార్పులు, ప్రభుత్వాల మార్పుల నేపథ్యంలో ఈ అంశం మళ్లీ సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ కేసును తిరిగి పూర్తిస్థాయిలో లోతుగా విచారించింది.

విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా అన్ని ప్రధాన దినపత్రికల్లో విస్తృత బహిరంగ ప్రకటనలు జారీ చేసింది. మార్గదర్శిలో డిపాజిట్ చేసిన వారిలో ఎవరికైనా అసలు గానీ, వడ్డీ గానీ రాకపోతే నేరుగా హైకోర్టుకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. అయినప్పటికీ ఒక్క డిపాజిటర్ కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. ఆ సమయంలో సమర్పించిన లెక్కల ప్రకారం రూ. 2,596 కోట్ల డిపాజిట్లను పూర్తిగా చెల్లించినట్లు స్పష్టమైంది. చిరునామాలు దొరకక క్లెయిమ్ చేసుకోని వారి కోసం సైతం రూ. 5.33 కోట్ల మొత్తాన్ని ప్రత్యేక ఎస్క్రో (Escrow) ఖాతాలో భద్రపరిచారు. ఈ వాస్తవాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే తెలంగాణ హైకోర్టు కేసును కొట్టివేసింది.

ఉన్నత న్యాయస్థానాలు మూడుసార్లు కేసును కొట్టివేసిన తర్వాత కూడా కొంతమంది తమ వాదనలను మార్చుకోకపోవడం గమనార్హం. ఇప్పుడు కొత్తగా, ఆర్బీఐ చట్టం ప్రకారం మార్గదర్శిపై రెట్టింపు జరిమానా విధించే అవకాశం ఉందని, రూ. 2500 కోట్లకు గాను సుమారు రూ. 5000 కోట్ల భారీ జరిమానా వేయవచ్చంటూ కొత్త చర్చను మొదలుపెట్టారు. కోర్టుల్లో కేసులు పూర్తిగా ముగిసిన తర్వాత కూడా ఇలాంటి వాదనలు తీసుకురావడం కేవలం రాజకీయ ఉనికిని, ప్రచారాన్ని కాపాడుకోవడానికేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

హిందూ అవిభక్త కుటుంబం (HUF) కింద నడిచే సంస్థలు డిపాజిట్లు సేకరించకూడదనే ఆర్బీఐ సెక్షన్ 45S నిబంధనను ఉల్లంఘించారని, డబ్బులు వెనక్కి ఇచ్చినా సరే చట్టం ప్రకారం శిక్షించి తీరాల్సిందేనని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. "తప్పు చేసినవాడు తర్వాత సొమ్మును తిరిగి ఇచ్చేస్తే నేరం కాకుండా పోతుందా?" అంటూ విలేకరుల సమావేశాల్లో తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధించేవారు. అయితే ఇదే చట్టబద్ధమైన నైతికత ఇతర కీలక రాజకీయ వ్యవహారాల్లో ఎందుకు వర్తించలేదనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి.

గత చరిత్రను పరిశీలిస్తే, 2006లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో కడప జిల్లా ఇడుపులపాయలో సుమారు 310 ఎకరాల పేదల అసైన్డ్ భూమిని, రాజంపేట కుందూరు వద్ద మరో 1000 ఎకరాల రిజిస్టర్ కాని ప్రభుత్వ భూమిని ఒక ప్రముఖ కుటుంబం తమ ఆధీనంలో ఉంచుకుని అనుభవించినట్లు ఒప్పుకుని, ఆ తర్వాత మీడియాలో వార్తలు రావడంతో ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన సందర్భం ఉంది.

చట్టం దృష్టిలో చూస్తే—ప్రభుత్వ ఆస్తులను లేదా అసైన్డ్ భూములను అక్రమంగా ఆక్రమించి ఏళ్ల తరబడి అనుభవించి, వివాదం బయటపడ్డాక వెనక్కి ఇచ్చినంత మాత్రాన ఆ నేరం రద్దయిపోతుందా? మరి నిబంధనలు, చట్టాలపై మాట్లాడేవారు ఆనాడు ఆ భూముల ఆక్రమణల విషయంలో ఎందుకు శిక్షలు డిమాండ్ చేయలేదు? కేవలం వ్యాపార సంస్థలపై ఒక న్యాయం, రాజకీయ నాయకుల ఆక్రమణలకు మరో న్యాయం మాట్లాడటం స్పష్టమైన ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది.

Tags

Be the first to react

Latest