LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Opinion

Vijay Trisha Controversy: విజయ్-త్రిష వ్యవహారంపై సముద్రఖని సంచలన వ్యాఖ్యలు.. అందులో నాకేం పశ్చాత్తాపం లేదు!

Vijay Trisha Controversy: దళపతి విజయ్, త్రిషల వ్యక్తిగత ప్రవర్తనపై తాను చేసిన విమర్శలను నటుడు సముద్రఖని సమర్థించుకున్నారు. 'కార్మేని సెల్వం' ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో ఆయన మాట్లాడిన వివరాలు

AndhraPravasi News Desk 2 min read
Vijay Trisha Controversy: విజయ్-త్రిష వ్యవహారంపై సముద్రఖని సంచలన వ్యాఖ్యలు.. అందులో నాకేం పశ్చాత్తాపం లేదు!

Vijay Trisha Controversy: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, నటి త్రిషల వ్యక్తిగత వ్యవహారంపై ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తన తాజా చిత్రం 'కార్మేని సెల్వం' ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన, గతంలో విజయ్‌పై తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఆ మాటలు రికార్డ్ అవుతున్నాయని తెలిసే మాట్లాడానని, అందులో పశ్చాత్తాపం చెందడానికి ఏమీ లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

విజయ్ తన భార్య సంగీతతో విడాకుల ఇష్యూ నడుస్తున్న సమయంలో, త్రిషతో కలిసి బహిరంగంగా ఒక వివాహ వేడుకకు హాజరుకావడంపై గతంలో సముద్రఖని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో విలేకరులు దీని గురించి ప్రశ్నించగా, సముద్రఖని ఏమాత్రం తడబడకుండా సమాధానమిచ్చారు. "నా మనసులో ఉన్న బాధనే బయటపెట్టాను. ఆ సమయంలో నాకు అనిపించింది మాట్లాడాను, అందులో దాచడానికి ఏముంది?" అని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో ఇలాంటి పనులు చేయడం సరికాదన్నది సముద్రఖని అభిప్రాయం. "విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని మొదటగా స్వాగతించిన వాళ్లలో నేనూ ఒకడిని. ఆయనకు నా పూర్తి మద్దతు ఉంది. కానీ, బాధ్యతాయుతమైన పదవిలోకి వెళ్లాలనుకునే వ్యక్తి ప్రవర్తన ఇలా ఉండటం చూసి తట్టుకోలేకపోయాను. అందుకే ఆ ఆవేదనను వ్యక్తపరిచాను. ఆ వ్యక్తి వీడియో తీస్తున్నాడని నాకు తెలుసు, తీసిన తర్వాత కూడా అతన్ని నేను ప్రశ్నించాను" అని సముద్రఖని వివరించారు.

గత ఫిబ్రవరిలో విజయ్ తన భార్యకు విడాకులు ఇస్తున్నారనే వార్తలు కోలీవుడ్‌ను కుదిపేశాయి. ఆ తర్వాత మార్చి 5న చెన్నైలో జరిగిన ఒక పెళ్లిలో విజయ్, త్రిష ఇద్దరూ ఒకే రకమైన రంగు దుస్తులు  వేసుకుని కనిపించడం పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై సముద్రఖని స్పందిస్తూ.. "వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే అవి నాలుగు గోడల మధ్యే ఉండాలి. ఇలా అందరి ముందు ప్రదర్శించడం వల్ల ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు?" అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

 తాను మాట్లాడిన మాటల పట్ల తనకు ఎలాంటి విచారం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తాను అన్నది తప్పని అనిపించలేదని సముద్రఖని ధీమా వ్యక్తం చేశారు. కాగా, సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన 'కార్మేని సెల్వం' సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి.

Be the first to react

More Coverage

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: తన ప్రియురాలికి ఖరీదైన ఐఫోన్‌ను కానుకగా ఇచ్చేందుకు ఓ మైనర్ బాలుడు ఏకంగా రూ.11.39 లక్షల విలువ…

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: వరంగల్‌కు చెందిన యువ గాయకుడు చోటు (శివకుమార్) సాధించిన ఆరు ప్రపంచ రికార్డుల గురించిన…