LIVE
Chandrababu: ప్రజల నమ్మకం పెంచేందుకు జూలై నుంచి అధికారుల క్షేత్ర పర్యటనలు తప్పనిసరి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు!  •  Chandrababu: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా పంటల సాగు విధానాలు రూపొందించాలి.. సీఎం చంద్రబాబు సూచనలు!  •  Yoga: సంజీవనితో యోగాను అనుసంధానం చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలి.. సీఎం చంద్రబాబు!  •  Kollu Ravindra: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. మంత్రి కొల్లు రవీంద్ర!  •  Gottipati Ravi: వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. మార్కాపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్!  •  Kollu Ravindra: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం.. మంత్రి కొల్లు రవీంద్ర!  •  Nimmala Ramanaidu: రెండేళ్ల కూటమి పాలనకు ప్రజల బ్రహ్మరథం.. మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు!  •  President: రేపటి నుంచి మధ్యప్రదేశ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పర్యటన!  •  Amarnath: అమర్‌నాథ్ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు.. 63 మంది అధికారుల నియామకం!  •  Jal Jeevan Mission: జల్ జీవన్ మిషన్ 2.0 అమలుకు కేంద్రంతో జమ్మూ-కాశ్మీర్ ఒప్పందం!  • 
Opinion

చంద్రబాబు 'మూడో బిడ్డ' పిలుపు వెనుక అసలు రహస్యం ఇదేనా? లండన్ ఎన్నారై సంచలన విశ్లేషణ!

రాబోయే తరాలకి ఏది అవసరమో, మనతరం ఆలోచించుకుని అడుగులేద్దాం!! కడుపునిండిన వర్గాలు ఇక చాలు అనుకుంటే, రేపన్న రోజు అండ లేకుండా పోయిందే.. ఆని వగచే పరిస్థితి తెచ్చుకోవద్దు!! మన ఇళ్లల్లో జనన మరణాల రేటు & 1-10ఏళ్ల లోపు ఎంత మందున్నారో లెక్కలేసుకుని, ఆ తరవాత బాబు గారిని విమర్శించండి....ఆయన…

AndhraPravasi News Desk 2 min read
చంద్రబాబు 'మూడో బిడ్డ' పిలుపు వెనుక అసలు రహస్యం ఇదేనా? లండన్ ఎన్నారై సంచలన విశ్లేషణ!

బాబు గారూ.. మీ మనసులో మాటను పచ్చిగా చెప్పేసిన జానపాడు కార్యకర్త!

ఆయనొక రాజకీయ చాణక్యుడు: చంద్రన్న వదిలిన జనాభా విత్తనం వెనుక క్రెమీ లేయర్ వ్యూహం!

పోషించే శక్తి ఉన్నోడే ఎక్కువ మందిని కనాలి.. బాబు గారి పిలుపుపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్!

Nara Chandrababu Naidu గారు ఇచ్చిన మూడో బిడ్డ నాలుగో బిడ్డ పిలుపు  మీద జరుగుతున్న చర్చ చాలా బాగుంది... రెండు పక్కల ఇద్దరూ తమ తమ పరిధిలో ఆలోచించి సమర్ధన/వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు..బహుశా ఆయనకు కావాల్సింది కూడా ఇదే రకమైన చర్చ... దాని కోసమే ఆయన ఆ విత్తనం జనంలోకి వదిలాడు అనుకుంటా!!! కానీ జనం మాత్రం అదేదో పాలసీ అయిపోయింది అన్నట్టుగా వాదప్రతివాదనలతో ఏది మంచి ఏది చెడు అని విశ్లేషణలు చేస్తున్నారు!!!

మనం మర్చిపోతున్న విషయం... ఆయనొక రాజకీయ నాయకుడు!!... రాష్ట్రానికి పాలనాధక్షుడు!! కాబట్టి ఆయన చెప్పాల్సిన లేదా చెప్పాలనుకున్న మాటని సూటిగా కాకుండా జనరలైజ్ చేసి చెప్పాడు!! ఇలాంటి స్పందన వస్తుందని ఊహించే ఉంటాడు!!! తాను ఎవరిని ఉద్దేశించి చెప్పాలనుకుని రాజకీయ పరిమితులకి లోబడి చెప్పలేక పోయాడో, ఆయా వర్గాలకే దీనిని అనవ్యయించేలా & కొన్ని వర్గాలని దీనికి దూరంగా ఉంచేలా నిపుణులు, మేధావులు, విశ్లేషకులు చేసే వాదనలే ఆయనకి కూడా కావాల్సింది!! తద్వారా తన లక్ష్యమైన ఆ క్రిమీ లేయర్కి మాత్రమే ఈ సూత్రం వర్తించేలా సమాజము అడుగులేస్తుందని ఆశిద్దాం!!!

ఒక Telugu Desam Party (TDP) కార్యకర్తగా & చంద్రన్నకి అనుచరుడిగా, ఆయన మనసులో ఏమనుకుని..దానిని బయటికి సూటిగా చెప్పలేక... జనరలైజ్ చేసి  చెప్పుంటాడో చెప్పనా!!!

1) అధికాదాయం ఉన్న కుటుంబాలు, మీ పిల్లలకు 25-27 లోపు పెళ్లి చేసేయండి!!!

2)కులగోత్రాల చట్రంలో ఇరుక్కోకుండా, మీ ఆర్ధిక స్థితి గతులు, గౌరవ మర్యాదలకి & మీ పిల్లల వ్యక్తిత్వాలకి మ్యాచ్ అయ్యే సంబంధాలు ఏ కులంలో వున్నా  హాయిగా చేసుకోండి...ఇదే మీకు & వంశాలకి ధర్మరక్ష!!!

3)30 లోపే ఇద్దరు పిల్లలని కనేసి..వీలుంటే ఆ తర్వాత ఎప్పుడైనా మూడు లేదా నాలుగో బిడ్డకి వెళ్లండి...మీకున్న సంపద & విజ్ఞానంతో వాళ్లని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దగలరు!!...దేశానికి బలం చేకూర్చగలరు!!....మీ పిల్లల సంపాదనలతో, మీరు అంగబలం& అర్ధబలంతో మరింత బలపడతారు!!! మీ బలం Intellectually Enabled పిల్లలే..

4)పోషించే శక్తి లేనోడు ఎక్కువమంది కని, దేశానికి భారంగా మారే బదులు...వాడు ఒకరికే పరిమితమై, వాళ్ళని జాగ్రత్తగా పెంచుకుంటే చాలు... శక్తున్నోడు ఎక్కువ మందిని కనేసి, దేశ నిర్మాణంలో మరింత నిర్ణయాత్మక పోషిస్తారు...

కానీ అంత పచ్చిగా నిజం మాట్లాడితే ఆయనని పేదల వ్యతిరేకిగా నానా యాగీ చేసి, రాజకీయంగా దుమ్మెత్తి పోస్తారు.... అందుకే తెలివిగా ఎవడు ఎంతమందిని కనాలో, మేధావులే తీర్మానించేలా... అదే సమయంలో తగ్గిపోతున్న జనాభా గురుంచి ఏం చేయాలో కూడా, చర్చకు తెరలేపాడు!!

నాకు తెలిసి మా #జానపాడు లో 25-30 ఎకరాల పొలం ఉండి చేతిలో 25 కోట్లు డబ్బున్న కుటుంబాలు చాలా వున్నాయి...కానీ వాళ్ళకి మునువుటి తరాల మాదిరి అంగబలం లేదు....ఒకప్పటిలా పిలవకుండానే తోడొచ్చే  నలుగురు నమ్మకస్థులు లేరు...మన దగ్గర అంగబలం & అర్ధబలం రెండూ ఉంటే మనల్ని ఆపే దమ్ముందా ఎవడికైనా!!!   ఆ ఆలోచన సమాజంలో ఎందుకో కనుమరుగయింది...ఉన్న ఒక్కరిద్దరే అన్నీ అనుభవిస్తారనే దగ్గర ఆగిపోయాం కానీ, దానిని పదింతలు చేసే బలం ఎందుకు పెంచుకోకూడదనేది మర్చిపోయాం!!!

రాబోయే తరాలకి ఏది అవసరమో, మనతరం ఆలోచించుకుని అడుగులేద్దాం!! కడుపునిండిన వర్గాలు ఇక చాలు అనుకుంటే, రేపన్న రోజు అండ లేకుండా పోయిందే.. ఆని వగచే పరిస్థితి తెచ్చుకోవద్దు!! మన ఇళ్లల్లో జనన మరణాల రేటు & 1-10ఏళ్ల లోపు ఎంత మందున్నారో లెక్కలేసుకుని, ఆ తరవాత బాబు గారిని విమర్శించండి....ఆయన చెప్పేది మీ కోసమే!!!.... నమ్మక చెడిపోవద్దు!!

Yours
Sivaram kurapati
Janapadu/London

Be the first to react

More Coverage

Crime News: కన్నవారే కాలయములైతే.. నడివీధిలో యువతిపై తల్లిదండ్రుల దాడి, సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Crime News: కన్నవారే కాలయములైతే.. నడివీధిలో యువతిపై తల్లిదండ్రుల దాడి, సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Crime News: ప్రేమించి పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో కన్న కూతురిపై తల్లిదండ్రులే పైశాచికంగా దాడి చేశారు…