LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Opinion

108 Emergency Services: అడవి బిడ్డకు అండగా '108'.. ప్రాణాలకు తెగించి గర్భిణిని కాపాడిన సిబ్బంది!

108 Emergency Services: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో 108 సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. సరైన రహదారి సౌకర్యం లేని మారుమూల గ్రామంలో ప్రసవ వేదనతో ఉన్న గిరిజన గర్భిణిని 2 కిలోమీటర్ల మేర స్ట్రెచర్‌పై మోసుకెళ్లి, సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడారు

AndhraPravasi News Desk 2 min read
108 Emergency Services: అడవి బిడ్డకు అండగా '108'.. ప్రాణాలకు తెగించి గర్భిణిని కాపాడిన సిబ్బంది!

Rampachodavaram News: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక గిరిజన గ్రామంలో మానవత్వం చాటి చెప్పింది. రహదారి సౌకర్యం లేని మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక గర్భిణిని కాపాడేందుకు 108 సిబ్బంది చేసిన సాహసం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, కొండలు వాగులు దాటుకుంటూ వెళ్లి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. రంపచోడవరం మండలం బీ.రామన్నపాలెం గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

అంబులెన్స్ వెళ్లలేని చోట.. 

బీ.రామన్నపాలెం గ్రామానికి చెందిన ఒక గిరిజన మహిళకు హఠాత్తుగా ప్రసవ వేదన మొదలైంది. ఊరికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లడం పెద్ద సవాలుగా మారింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 అత్యవసర సేవలకు ఫోన్ చేశారు. సమాచారం అందిన వెంటనే రంపచోడవరం నుంచి అంబులెన్స్ బయలుదేరింది. అయితే, గ్రామానికి 2 కిలోమీటర్ల ముందే రోడ్డు ఆగిపోయింది. అటుపై అంతా రాళ్లు, రప్పలు, ఎగుడుదిగుడు మార్గం కావడంతో వాహనం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

భుజాన మోస్తూ.. రెండు కిలోమీటర్ల ప్రయాణం

సమయం మించిపోతుండటంతో 108 ఈ.ఎమ్.టి  పైలట్ ఏమాత్రం ఆలోచించలేదు. అంబులెన్స్‌లో ఉన్న స్ట్రెచర్‌ను తీసుకుని కాలినడకన అడవి బాట పట్టారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర కొండలు, వాగులు దాటుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆ గర్భిణిని స్ట్రెచర్‌పై పడుకోబెట్టి, అత్యంత చాకచక్యంగా భుజాలపై మోస్తూ తిరిగి అంబులెన్స్ ఉన్న చోటికి తీసుకువచ్చారు. ఎండను కూడా లెక్కచేయకుండా వారు చూపిన చొరవ స్థానికులను అబ్బురపరిచింది.

సురక్షితంగా ఆసుపత్రికి.. ప్రాణం నిలబెట్టిన వైనం

అంబులెన్స్‌లోకి చేర్చిన వెంటనే సిబ్బంది ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అత్యంత వేగంగా వాహనాన్ని నడిపి రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి ఆమెకు కాన్పు చేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో వైద్య సేవలు అందడం వల్లే ఆ మహిళ ప్రాణాలు దక్కాయని బాధితురాలి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

సేవలో తృప్తి.. అధికారుల ప్రశంసలు

మా కష్టం ఒక ప్రాణాన్ని కాపాడిందనే తృప్తి మాకు చాలు అని 108 సిబ్బంది గర్వంగా చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వెనకడుగు వేయకుండా సేవలు అందించడమే మా బాధ్యతని వారు పేర్కొన్నారు. ఈ సాహసోపేతమైన పని చేసిన సిబ్బందిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు  గిరిజన నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ సేవలంటే ఇలాగే ఉండాలని స్థానికులు కొనిాడుతున్నారు

Be the first to react

More Coverage

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: తన ప్రియురాలికి ఖరీదైన ఐఫోన్‌ను కానుకగా ఇచ్చేందుకు ఓ మైనర్ బాలుడు ఏకంగా రూ.11.39 లక్షల విలువ…

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: వరంగల్‌కు చెందిన యువ గాయకుడు చోటు (శివకుమార్) సాధించిన ఆరు ప్రపంచ రికార్డుల గురించిన…