LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Opinion

Shocking News: విశాఖలో దారుణం... ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి!

Shocking News: విశాఖలో ఒక నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన ఘటన కలకలం రేపింది. డబ్బుల వేధింపుల వల్లే చంపానని నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AndhraPravasi News Desk 2 min read
Shocking News:  విశాఖలో దారుణం... ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి!

మౌనిక హత్య కేసు: ముక్కలుగా నరికి.. గోనె సంచుల్లో కుక్కిన కిరాతకుడు…

భార్య పుట్టింటికి వెళ్లగానే ప్రియురాలిని పిలిచి.. ప్రాణాలు తీసిన రవీంద్ర…

ఎల్.వి. నగర్‌లో ఘోరం: యువతి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన వైనం…

Shocking News: విశాఖపట్నంలోని ఎల్.వి. నగర్‌లో అత్యంత పాశవికమైన హత్య వెలుగులోకి వచ్చింది. భారత నౌకాదళం (నేవీ)లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రవీంద్ర (35) అనే వ్యక్తి, మౌనిక (29) అనే యువతిని అతి దారుణంగా హత్య చేశాడు. కేవలం ప్రాణాలు తీయడమే కాకుండా, ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన తీరు స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. నిందితుడు రవీంద్ర విజయనగరం జిల్లా రాజాంకు చెందినవాడు కాగా, మృతురాలు విశాఖకు చెందిన యువతిగా గుర్తించారు.

ఈ ఘటనకు గల నేపథ్యాన్ని పరిశీలిస్తే, రవీంద్ర భార్య నెల రోజుల క్రితమే విజయనగరంలోని తన పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో భార్య లేని సమయాన్ని చూసి, గతంలో పరిచయం ఉన్న మౌనికను రవీంద్ర తన ఇంటికి పిలిపించుకున్నాడు. అయితే, వారిద్దరి మధ్య ఏదో విషయంలో తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ గొడవ కాస్తా ముదిరిపోవడంతో ఆవేశానికి లోనైన రవీంద్ర, మౌనికను చంపి ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు.

హత్య అనంతరం నిందితుడు మృతదేహాన్ని మాయం చేసేందుకు అత్యంత భయంకరమైన పద్ధతిని ఎంచుకున్నాడు. శరీరంలోని సగ భాగాలను మూటగట్టి ఫ్రిజ్‌లో పెట్టగా, మరికొన్ని భాగాలను గోనె సంచిలో కట్టాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఘటనా స్థలంలో యువతి తల భాగం ఇంకా లభ్యం కాలేదని తెలుస్తోంది. ఒక నేవీ ఉద్యోగి అయి ఉండి, ఇంతటి క్రూరత్వానికి ఒడిగట్టడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

దారుణం చేసిన తర్వాత రవీంద్ర నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తాను చేసిన తప్పును ఒప్పుకుంటూ పోలీసులకు వివరాలు తెలిపాడు. మౌనిక తనను డబ్బుల కోసం తరచూ వేధించేదని, ఆ వేధింపులు భరించలేకనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నిందితుడు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. అయితే, కేవలం డబ్బుల కోసమే ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడా లేక మరేదైనా బలమైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు ఎల్.వి. నగర్‌లోని రవీంద్ర ఇంటికి చేరుకుని ఫ్రిజ్‌లో, గోనె సంచుల్లో ఉన్న శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ మరియు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, మృతదేహ భాగాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది.

Be the first to react

More Coverage

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: తన ప్రియురాలికి ఖరీదైన ఐఫోన్‌ను కానుకగా ఇచ్చేందుకు ఓ మైనర్ బాలుడు ఏకంగా రూ.11.39 లక్షల విలువ…

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: వరంగల్‌కు చెందిన యువ గాయకుడు చోటు (శివకుమార్) సాధించిన ఆరు ప్రపంచ రికార్డుల గురించిన…