బాధితులకు వేగంగా న్యాయం అందించే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కట్టుబడి పనిచేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తెలిపారు. ఆధునిక సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ప్రత్యేక దృష్టి సారించి మార్గనిర్దేశం చేస్తున్నారని ఆమె అన్నారు.
గత ఏడాది కాలంలో డ్రోన్ పోలీసింగ్, మహిళల భద్రత కోసం శక్తి యాప్, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన సీసీటీవీ వ్యవస్థ వంటి పలు ఆవిష్కరణలు అమలు చేసి మంచి ఫలితాలు సాధించామని వివరించారు. పోక్సో కేసులకు ప్రాధాన్యతనిస్తూ, ప్రత్యేక దర్యాప్తు చేపట్టి, కేవలం రెండు నుంచి ఆరు నెలల లోపే విచారణ పూర్తిచేసి న్యాయం అందిస్తున్నామని చెప్పారు.
ప్రజా నమ్మకం, భద్రత, సంక్షేమాన్ని పెంపొందించడం లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్తో పాటు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా సమర్థవంతంగా పనిచేస్తోందని హోం మంత్రి అనిత వెల్లడించారు.