మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో జరుగుతున్న కొన్ని వార్తలను ఖండించారు. సినీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై తాను హామీ ఇచ్చినట్లు వస్తున్న వార్తలు అసత్యమని ఆయన స్పష్టంచేశారు.
చిరంజీవి మాట్లాడుతూ, "కార్మికులకు 30% వేతనం పెంపు, ఇతర డిమాండ్లు అమలయ్యేలా చూస్తానని నేను ఎప్పుడూ చెప్పలేదు. అలాగే, షూటింగ్ ప్రారంభిస్తానని కూడా హామీ ఇవ్వలేదు. ఇవన్నీ తప్పుడు ప్రచారమే" అని అన్నారు.
అలాగే తాను ఇప్పటివరకు ఈ విషయంలో ఎవ్వరినీ కలవలేదని, ఎలాంటి వ్యక్తిగత హామీ ఇవ్వలేనని తెలిపారు. ఇది పూర్తిగా ఇండస్ట్రీ సమస్య అని, దీని పరిష్కారం కోసం ఫిల్మ్ ఛాంబర్‌కే తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఆయన స్పష్టం చేశారు.
చిరంజీవి తన ప్రకటనలో, ఈ తరహా తప్పు సమాచారం ప్రజల్లో, సినీ వర్గాల్లో గందరగోళం సృష్టిస్తుందని పేర్కొన్నారు. అందువల్ల వాస్తవాలను తెలుసుకోకుండా, అసత్య ప్రచారం చేయకుండా ఉండాలని సూచించారు.