LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Health

Down Syndrome symptoms: చిన్న వయసులోనే థెరపీ మొదలుపెడితే అద్భుతాలే.. డౌన్ సిండ్రోమ్ చికిత్సపై కీలక సూచనలు!

Down Syndrome symptoms: డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల ఎదుగుదలలో మొదటి ఐదు సంవత్సరాలు అత్యంత కీలకం. ఈ సమయంలో ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వంటి 'ఎర్లీ ఇంటర్వెన్షన్' సేవలు వారి మెదడు అభివృద్ధికి ఎలా తోడ్పడతాయో తెలుసుకోండి.

AndhraPravasi News Desk 2 min read
Down Syndrome symptoms: చిన్న వయసులోనే థెరపీ మొదలుపెడితే అద్భుతాలే.. డౌన్ సిండ్రోమ్ చికిత్సపై కీలక సూచనలు!

Down Syndrome symptoms:  పిల్లల ఎదుగుదలలో ప్రతి దశ ముఖ్యమైనదే, కానీ 'డౌన్ సిండ్రోమ్'తో జన్మించిన పిల్లల విషయంలో మొదటి ఐదు సంవత్సరాలు అత్యంత కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? చిన్న వయసులోనే చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి మార్పులు వస్తాయి? అనే అంశాలు మీకోసం.

ఏంటి ఈ డౌన్ సిండ్రోమ్?

సాధారణంగా మనిషి శరీరంలోని ప్రతి కణంలో 46 క్రోమోజోములు ఉంటాయి. కానీ, కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల 21వ క్రోమోజోమ్ అదనంగా మొత్తం 47 ఏర్పడటాన్ని 'డౌన్ సిండ్రోమ్' అంటారు. దీనివల్ల పిల్లల శారీరక ఆకృతిలో మార్పులు రావడమే కాకుండా, మెదడు ఎదుగుదల కూడా కాస్త నెమ్మదిగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఈ సమస్యతో జన్మిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

మొదటి ఐదేళ్లు ఎందుకు 'గోల్డెన్ పీరియడ్'?

పిల్లల మెదడు మొదటి ఐదేళ్లలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కోట్లాది నరాల అనుసంధానాలు ఈ సమయంలోనే జరుగుతాయి. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో కండరాల పట్టు తక్కువగా ఉండటం  వల్ల బోర్లా పడటం, కూర్చోవడం, నడవడం వంటివి ఆలస్యమవుతాయి. అందుకే ఈ 'విండో పీరియడ్'లో ఇచ్చే శిక్షణ వారి భవిష్యత్తును మారుస్తుంది.

ఎర్లీ ఇంటర్వెన్షన్' అంటే ఏమిటి?

పిల్లల్లో లోపాలను గుర్తించి వెంటనే అందించే చికిత్సనే 'ఎర్లీ ఇంటర్వెన్షన్' అంటారు. ఇందులో ప్రధానంగా మూడు రకాల థెరపీలు ఉంటాయి:

ఫిజియోథెరపీ: కండరాలకు బలాన్ని ఇచ్చి, పిల్లలు త్వరగా నడిచేలా చేస్తుంది.

స్పీచ్ థెరపీ: మాటలు రావడం ఆలస్యమైతే, సైగలు లేదా చిన్న చిన్న పదాల ద్వారా భావాలను పంచుకోవడం నేర్పిస్తారు.

ఆక్యుపేషనల్ థెరపీ: బ్రష్ చేసుకోవడం, అన్నం తినడం వంటి రోజువారీ పనులను సొంతంగా చేసుకునేలా శిక్షణ ఇస్తారు.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

ఈ పిల్లల్లో కేవలం ఎదుగుదల సమస్యలే కాకుండా.. గుండె సంబంధిత వ్యాధులు, వినికిడి లోపం, థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాతో వైద్య పరీక్షలు చేయించడం ఎంతో అవసరం. సకాలంలో వైద్యం అందితే వారు కూడా అందరిలాగే ఆరోగ్యంగా ఉండగలరు.

మనవంతు బాధ్యత..

డౌన్ సిండ్రోమ్ అనేది జబ్బు కాదు, అది ఒక శారీరక స్థితి మాత్రమే. సరైన సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, నిపుణుల శిక్షణ ఉంటే ఈ పిల్లలు అద్భుతాలు సృష్టించగలరు. వారిని వివక్షతో చూడకుండా, ప్రేమతో ఆదరించినప్పుడే వారు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలరు.

Be the first to react

More Coverage