Header Banner

వీఆర్పీఎల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ! రూ.2,212 కోట్లతో విశాఖ నుంచి ..

  Tue May 06, 2025 11:20        Australia, Politics

విశాఖ నుంచి చత్తీస్ గఢ్ లోని రాయపూర్ వరకు రూ.2,212 కోట్లతో నిర్మించనున్న పైర్లైన్ (వీఆర్పీఎల్) ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు సంప్రదింపుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


విశాఖ నుంచి చత్తీస్గఢ్లోని రాయపూర్ వరకు రూ.2,212 కోట్లతో నిర్మించనున్న పైప్లాన్ (వీఆర్పీఎల్) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు సంప్రదింపుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూ యజమానులతో సంప్రదింపుల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు ఛైర్మన్లుగా ఆర్డీఓ, హెచ్పీసీఎల్ సీజీఎం (ప్రాజెక్ట్స్), జీఎం/సీజీఎం (ప్రొక్యూర్మెంట్/ఆపరేషన్స్), జీఎం/డీజీఎం/సీజీఎం (ఫైనాన్స్) సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. విశాఖలోని ఈ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా ఏడాదికి 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని 15 ఎంఎంటీఏకు పెంచేందుకు సంస్థ నిర్ణయించింది. దీనికోసం విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 165 కి.మీ.ల మేర పైపులైన్, పంపింగ్/పిగ్గింగ్ స్టేషన్ల నిర్మాణం కోసం భూసేకరణ చేయనున్నారు. 2027 సెప్టెంబరు నాటికి ఈ పనులను పూర్తి చేయాలన్నది లక్ష్యం. విశాఖ-ధర్మపురి ప్రాజెక్టు కోసం గతంలో సంస్థ సొంతంగా భూములను సేకరించింది. అదేతీరులో వీఆర్పీఎల్ ప్రాజెక్టు కోసం భూముల సేకరణకు సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

 

ఇది కూడా చదవండివారికి వెంటనే పరిహారం ఇవ్వండి! కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VRPL #VisakhapatnamToRaipur #PipelineProject #InfrastructureDevelopment #AndhraProgress