Header Banner

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

  Mon May 05, 2025 14:08        Politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(సోమవారం) పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో వివిధ పనుల నిమిత్తం సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉండనున్నారు. ఉదయం 11:30 గంటలకు పథకాల అమలు తీరు, ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 2:30గంటలకు పర్యాటక శాఖ అధికారులతో పలు అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా శాఖల అధికారులతో అభివృద్ధి పనుల గురించి సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. వివిధ పనులపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు.

అలాగే.. ఈరోజు (మే5)వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు సీఎం చంద్రబాబును ప్రధానమంత్రి ఏపీ పర్యటన కోసం ఏర్పడ్డ మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు కలవనున్నారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసినందుకు మంత్రి వర్గ ఉప సంఘంతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాజధానిపై మరింత వేగంగా ముందుకు వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతికి సబంధించిన పనులపై వరుసగా సీఎం చంద్రబాబు సమీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేసేలా వడివడిగా చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే మంత్రి నారాయణకు కీలక బాధ్యతలు అప్పగించారు. అమరావతి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేసి తీరుతామని మంత్రి నారాయణ తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి నారాయణ మాట్లాడారు. అమరావతిని ఎకానమీ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. అమరావతి నిర్మాణంలో ప్రజలు కట్టే ట్యాక్సుల‌ డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ఉండదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి పునఃనిర్మాణ ప్రారంభ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారని మంత్రి నారాయణ అన్నారు. అందరూ క్రమశిక్షణగా ఉన్నారని చెప్పారు. అంతమంది ప్రజలతో భారీ సభను తానేప్పుడూ చూడలేదని అన్నారు. ఈ సభను చూసి కొందరు వైసీపీ నేతలు తట్టుకోలేక తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు అమరావతిపై లేనిపోని ఆరోపణలు, విషప్రచారాలు చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శలు చేశారు.

ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

నేడు (5/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APCM #CBN #meetings #schedule #key #orders