తెలుగు జాతి కీర్తి పతాక స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడని అటువంటి మహనీయుని పేరున పురస్కారాలు అందిస్తున్న ఫిలాంత్రోఫిక్ సొసైటీ అధ్యక్షులు అద్దంకి రాజ యోనా ధన్యజీవి అని మండలి బుద్ద ప్రసాద్ అన్నారు. శనివారం ఐలాపురం హోటల్ వేదికగా జాతీయ సంస్కృతోత్సవ పురస్కార వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన అయన వివిధ  రంగాలలో విశేష ప్రతిభ కనబరుస్తూ 25 మందికి ఎన్టీఆర్ కీర్తి పురస్కారాల అందించి ఘనంగా సత్కరించారు. విశిష్ట అతిధిగా విచ్చేసిన టీడీపీ ప్రవాస భారతీయ ప్రతినిధి చప్పిడి రాజశేఖర్ మాట్లాడుతూ సామాజిక సేవలో పునీతమవుతున్న వ్యక్తులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ ఇటువంటి పురస్కారాలు అందించడం హర్షణీయం అని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ మాట్లాడుతూ అవార్డు గ్రహీతలు మరింత బాధ్యతగా సాంస్కృతిక, సామాజిక సేవా రంగాలలో కృషి చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి: ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

సభాధ్యక్షులు శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ సి.ఈ.ఓ కళారత్న కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని డా. ఎన్టీఆర్ కీర్తి పురస్కారాలు అందించిన పాన్ ఇండియా సోషల్ కల్చరల్ అసోసియేషన్ నిర్వాహకులు అద్దంకి రాజా యోనాకు ప్రత్యేక అభినందనలు తెలిపి, పురస్కారం అందుకున్న ప్రముఖులకు శుభాకాంక్షలు అందచేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక జ్యోతి ప్రజ్వలన చేయగా ప్రత్యేక ఆహ్వానితులుగా డా. గుంజి నరసింహ రావు, ప్రముఖ సామాజిక వేత్త చెరుకువాడ రంగసాయి, టిటిడి బోర్డు మాజీ సభ్యులు ధారావత్ బాల్ సన్ నాయక్, శ్రీ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, హ్యూమన్ రైట్స్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ డా. ముక్కర శామ్యూల్ శేఖర్, డా. చల్లగాని సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.