కూటమి వర్సెస్ వైసీపీ గా సాగిపోతున్న ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అంటేనే గిట్టని కూటమి పార్టీల నాయకులు ఈ మధ్య ఆయన్ను మరో కొత్త పేరుతో పిలుస్తున్నారు. కూటమి పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు పలు చోట్ల ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడు, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పదే పదే ఈ పేరును ప్రస్తావిస్తున్నారు. తద్వారా జగన్ తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ మధ్య ఏపీలో ఎక్కడ చూసినా కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు వైఎస్ జగన్ ను వర్క్ ఫ్రమ్ బెంగళూరు అనే కొత్త పేరుతో పిలుస్తున్నారు. సాధారణంగా వర్క్ ఫ్రమ్ హోం అనే పేరు ప్రచారంలో ఉంది. దీన్ని కాస్త మార్చి వర్క్ ఫ్రమ్ బెంగళూరు పేరుతో జగన్ ను వీరు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు తమ ప్రెస్ మీట్లలో సైతం జగన్ ను విమర్శించాల్సి వచ్చినప్పుడు ఈ కొత్త పేరుతో వారు సంబోధిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!
ప్రతీ వారం జగన్ బెంగళూరుకు వెళ్లడం పరిపాటిగా మారిపోయింది. వారంలో సోమవారం బెంగళూరు నుంచి అమరావతికి వచ్చే వైఎస్ జగన్ తిరిగి గురువారం సాయంత్రానికి బెంగళూరుకు తిరిగి వెళ్లిపోతున్నారు. తిరిగి శుక్రవారం, శనివారం, ఆదివారం అక్కడే ఉండిపోయి సోమవారం తిరిగి వస్తున్నారు. దీంతో కూటమి పార్టీల నేతలంతా ఇప్పుడు జగన్ ను వర్క్ ఫ్రమ్ బెంగళూరుగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ కొత్త పేరు కూటమిలో ఎవరు కనిపెట్టారనే క్లారిటీ లేకపోయినా నాయకులంతా వరుసగా వాడిపారేస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!
నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు
పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!
అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!
ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!
సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..
నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!
ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: