ఇన్‌స్టాగ్రామ్‌ను ఇప్పటి తరానికి ఒక ప్రదర్శన వేదిక లేదా నర్తనశాల గా చెప్పుకోవచ్చు. యువత తమ జీవనశైలిని, ఆలోచనలను, ప్రతిభను ఈ వేదిక ద్వారా పంచుకొని, తాము గుర్తింపు పొందడంతో పాటు ప్రజాదరణను కూడా సంపాదిస్తున్నారు.
ఒకప్పుడు జీవన శైలిని బట్టి వ్యక్తులను అంచనా వేయడం సాధారణం. కానీ నేటి తరంలో మాత్రం సోషల్ మీడియా వీడియోలు, ఫోటోలు వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా మారాయి. ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే పాత తరం కూడా ఇప్పుడు కొత్త తరం చేస్తున్న వాటిని ప్రోత్సాహాన్ని అందించడం విశేషం గా చెప్పుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లతో దూసుకుపోతున్న ప్రముఖులు ఎవరో చూద్దాం. అలాగే భారతదేశంలో అత్యధిక అభిమానులను సంపాదించి, ఇన్‌స్టాగ్రామ్‌లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖులు ఎవరో కూడా తెలుసుకుందాం.
అత్యధిక ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది.
రెండో స్థానంలో పోర్చుగల్ యువకుడు క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు. అసలు ఎవరు ఈ క్రిస్టియానో రొనాల్డో అంటే ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్, సోషల్ మీడియా వేదికలో అత్యధిక అభిమానులను కలిగిన వ్యక్తి. రొనాల్డో జీవనశైలిని, ఆట ప్రతిభను, స్పోర్ట్స్ బ్రాండ్స్ ప్రమోషన్ కలిపి అభిమానులకు మరింత దగ్గరయ్యేలా చేశాయి. ప్రస్తుతం రొనాల్డోకు 664 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు.
లియోనెల్ మెస్సీ ఫుట్‌బాల్ ఆటగాడు, ఇన్‌స్టాగ్రామ్‌లో మూడవ స్థానంలో ఉన్నారు. ఫుట్‌బాల్ రాజ్యంలో అత్యధిక అవార్డులు గెలిచిన వ్యక్తి. ప్రపంచ కప్ విజయాలు, కుటుంబ క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం మెస్సీ ఫాలోవర్స్ సంఖ్య 506 మిలియన్లు.
హాలీవుడ్ గాయని, జస్టిన్ బీబర్ ప్రేయసిగా ప్రపంచానికి సుప్రసిద్ధి పొందిన సెలెనా గోమెజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాల్గవ స్థానంలో ఉన్నారు. ఆమె సంగీత ప్రస్థానం, సినిమాలు, జస్టిన్ బీబర్ ప్రేమ జీవితాన్ని నిజాయితీగా పంచుకోవడం వల్ల అభిమానులు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఆమెకు 417 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
హాలీవుడ్ యాక్షన్ స్టార్, మాజీ రెజ్లర్, సినిమా నిర్మాత, వ్యాపారవేత అయిన డ్వేన్ జాన్సన్, సినిమా అప్‌డేట్స్, కుటుంబ క్షణాలను అభిమానులతో పంచుతూ ఆకర్షిస్తున్నారు. జాన్సన్‌కు 392 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు .
అతి చిన్న వయసులో ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్‌లో చేరిన కైలీ జెన్నర్ అమెరికాకు చెందిన స్త్రీ. ఆమె 21 ఏళ్ల వయసులోనే ఈ జాబితాలో చేరింది. బ్యూటీ రంగంలో విభిన్నంగా అడ్వర్టైజ్ చేయడం, ఉత్పత్తులను అభిమానుల ద్వారా ప్రాచుర్యం చేయడం ద్వారా వ్యాపారంలో ఎదిగారు. కైలీ బ్యూటీ ప్రొడక్ట్స్, ఫ్యాషన్ ట్రెండ్స్, లగ్జరీ జీవితం ద్వారా యువతకు ఐకాన్‌గా నిలిచారు. ఆమెకు 392 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
భారతదేశంలో అత్యధిక అభిమానులతో టాప్ ఫైవ్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్:
క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నారు. లెజెండ్ విరాట్ కోహ్లీ, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన భారతీయుడు. క్రికెట్ ప్రతిభ, ఫిట్‌నెస్ రూటీన్స్, భార్యతో వీడియోలు, బ్రాండ్ ప్రమోషన్స్ ఇలా ఫాలోవర్స్ సంఖ్య పెంచారు. ప్రస్తుతం 273 మిలియన్ల ఫాలోవర్స్.
చిత్రరంగం, క్రీడా రంగం, వ్యాపార రంగం వ్యక్తులు అభిమానులను సంపాదించడం సర్వసాధారణం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక రాజకీయ నాయకుడు ఇంతమంది అభిమానులను ఆకర్షించడం విశేషం. ప్రజల కోసం నూతన మార్పులు చేస్తూ, నరేంద్ర మోదీ 97 మిలియన్లకు పైగా ఫాలోవర్లను ఇన్‌స్టాగ్రామ్‌లో సంపాదించారు, ఇది ప్రత్యేక రికార్డు.
బాలీవుడ్‌లో అందమైన నటి శ్రద్ధా కపూర్ సహజమైన వ్యక్తిత్వం, స్టైల్, ఫ్యాన్స్‌తో స్నేహపూర్వక సంబంధం వల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో రెండో స్థానంలో ఉన్నారు. ఆమెకు 93 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
హాలీవుడ్‌లో ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా. సినిమాలు, ఫ్యాషన్, సోషల్ వర్క్‌లో తన ముద్ర వేసి, ప్రపంచవ్యాప్తంగా 92 మిలియన్లకు పైగా అభిమానులు పొందారు.
సహజమైన నటన, మృదువైన వ్యక్తిత్వం, కుటుంబ క్షణాలను అభిమానులతో పంచుకునే అలియా భట్ బాలీవుడ్ యువతరానికి ప్రేరణ. తెరపై మాత్రమే కాక, సోషల్ మీడియాలో కూడా ఆమెకు 86 మిలియన్లకు పైగా అభిమానులు ఉన్నారు.