Tirumala: తిరుమలలో వెయ్యేళ్ళ సంప్రదాయ వైభవం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూనే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇటీవల రోజులుగా ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి సీనియర్ అధికారుల నుంచి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ప్రత్యేక కమిషనర్ల వరకు వరుస బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా మరో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ICICI: ఐసీఐసీఐ ఫెస్టివ్ బొనాంజా ఆఫర్లు..! రూ.50,000 వరకు డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు..!

ఈ మార్పులలో ముఖ్యంగా నాగలక్ష్మిని ఏపీ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. అంబేద్కర్‌ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగానికి ఐజీగా, చామకుర్తి శ్రీధర్‌ను ఎక్సైజ్ డైరెక్టర్‌గా పోస్టింగ్ చేశారు. ఆర్ అండ్ ఆర్ డైరెక్టర్‌గా ప్రశాంతి, సీఆర్డీఏ అదనపు కమిషనర్‌గా భార్గవ్ తేజ కొత్తగా నియమితులయ్యారు. అదేవిధంగా కృష్ణా జాయింట్ కలెక్టర్‌గా మల్లవరపు నవీన్, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సీఈఓగా కట్టా సింహాచలం, నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ముగిలి వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా మల్లిఖార్జునను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Ocean Gold Mines: మహాసముద్రాల్లో దాగి ఉన్న 20 మిలియన్ టన్నుల బంగారం! ఎక్కడ నుండి వచ్చిందో తెలుసా!

ఇటీవలి మార్పులలో ముఖ్యంగా టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్‌ను మరోసారి నియమించడం విశేషం. అలాగే శ్యామలరావు జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ కాగా, కృష్ణబాబు రోడ్లు-భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా సీహెచ్. శ్రీధర్, రెవెన్యూ-ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేశ్‌కుమార్ మీనా, అటవీ-పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే నియమితులయ్యారు. సౌరభ్ గౌర్ కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిగా, అనంతరామ్ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. పరిశ్రమలు, కార్మికశాఖ కమిషనర్‌గా శేషగిరిబాబు, రెవెన్యూ (ఎండోమెంట్) కార్యదర్శిగా హరి జవహర్‌లాల్ పోస్టింగ్ పొందారు.

StateDebts: రాష్ట్రాలపై అప్పుల ముంపు..! 10 ఏళ్లలో మూడింతలు పెరిగిన రుణభారం..!

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వివిధ సంస్థల్లో కూడా కీలక మార్పులు జరిగాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓగా ధాత్రి రెడ్డి, ఏపీ ఫైబర్‌నెట్ ఎండీగా గీతాంజలి శర్మ, మౌలిక వసతులు-పెట్టుబడుల శాఖ ఎండీగా పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ నియమితులయ్యారు. మరోవైపు ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ బాధ్యతలతో పాటు ఏపీఎస్‌బీసీఎల్ ఎండీగా, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు, అలాగే డిస్టిలరీస్ అండ్ బ్రేవరీస్ కమిషనర్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పులతో ప్రభుత్వ యంత్రాంగం మరింత చురుకుదనం సాధించి, పాలనలో వేగం పెరగనుందని అధికార వర్గాలు విశ్వసిస్తున్నాయి.

H-1b Visa: ట్రంప్ ప్రకటనతో అమెరికా ఎయిర్‌పోర్టుల్లో ఉద్రిక్త వాతావరణం..ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రశ్నార్థకం?
Sanjeevani Scheme: ఏపీ ప్రభుత్వం కొత్త పథకం! ఇంటి వద్ద నుండి ఆ సేవలు... ఒక్కో కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు...
AP News: ఆవుపేడలో దాగి ఉన్న సంపద – స్వయం సహాయక సంఘాలకి సువర్ణావకాశం!
Vahanamitra: వాహన మిత్ర దరఖాస్తులో సమస్యలా! వెంటనే ఈ పని చేయండి! రెండు రోజులే ఛాన్స్!
H-1B Visa Fee Hike: ట్రంప్ షాకింగ్ డెసిషన్! సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఎన్నారైల లో ఆందోళనలు!
Cashews: ఈ సమస్య ఉన్నవారు జీడిపప్పు తింటే లాభమా... నష్టమా!