Ants control tips: ఇంట్లో చీమల బెడదా? కెమికల్స్ వద్దు.. ఈ సింపుల్ చిట్కాలు చాలు! ఎలా పనిచేస్తుందో తెలిస్తే షాక్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఫేస్‌బుక్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంది సర్కార్. తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాస్ చంద్రబోస్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో అమరావతి రాజధాని గురించి వ్యంగ్యపూర్వక వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ పెట్టారు. “అమరావతి మునిగిపోయింది.. ఒక్క వర్షం వస్తే జలమయం అవుతోంది.. అంతేకాకుండా దీన్ని రిజర్వాయర్‌గా మార్చేస్తే సరిపోతుంది” అంటూ చేసిన ఆ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యవహారాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు.

Skincare: చంకలో వాసన వస్తోందా - దానికి కారణం ఏంటి? ఈ 5 ఇంటి చిట్కాలతో ప్రాబ్లమ్ సాల్వ్!

ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆగస్టు 21న సుభాస్ చంద్రబోస్‌కు మెమో జారీ చేస్తూ వివరణ కోరింది. ప్రజలకు అందుబాటులో ఉండే వేదికలైన సోషల్ మీడియా వాడకంలో ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాలని గుర్తు చేసింది. దీనిపై స్పందించిన బోస్, తన ఫేస్‌బుక్ అకౌంట్ వ్యక్తిగతమని, ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. ఇతర నగరాలైన హైదరాబాద్, చెన్నై వంటి మెట్రోపాలిటన్‌లు కూడా తరచుగా వర్షాలతో మునిగిపోతాయని, అమరావతి పరిస్థితిని కూడా అదే విధంగా పోల్చి రాసిన వ్యాఖ్యలేనని తన వివరణలో చెప్పారు.

PhonePe : భారత ఫిన్‌టెక్ రంగంలో కొత్త మైలురాయి అవబోతోంది ఫోన్‌పే.. IPO!

ఇక ఆయన మరింతగా తన వివరణలో, “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా విమర్శలను స్వాగతిస్తారు. సుప్రీం కోర్టు సైతం విమర్శలు ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాయని చెప్పింది” అంటూ పేర్కొన్నారు. అయితే ఈ వాదనలను ప్రభుత్వం తిరస్కరించింది. “గవర్నమెంట్ సర్వెంట్స్ చేసే పోస్టులు వ్యక్తిగతమైనవిగా పరిగణించలేము. ఉన్నతస్థాయి ఉద్యోగులు చేసే వ్యాఖ్యలు ప్రజలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు చెప్పిన వివరణ సరైనది కాదు” అని సర్కార్ స్పష్టం చేసింది.

Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి షురూ.. రిజర్వేషన్లు ఖరారు!

దీంతో చివరికి ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం, సుభాస్ చంద్రబోస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు మంగళవారం ఈమేరకు అధికారిక ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించడమే ఈ చర్యకు కారణమని తెలిపారు. బోస్‌పై విచారణ కొనసాగుతుందని, తుది నిర్ణయం అనంతరం మరిన్ని చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రభుత్వ ఉద్యోగులకు సోషల్ మీడియాలో వాడకం విషయంలో ఒక పెద్ద హెచ్చరికగా మారింది.

Celebrity Couple: ప్రియుడితో సమంత రొమాంటిక్ డేట్.. ఒకే కారులో, ఒకే డ్రెస్సులో.. పబ్లిక్‌గా దొరికిపోయారు!!
Ladakh Students: లడఖ్ రాజధాని లేహ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థుల ఆందోళన!
Group -1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! హైకోర్టు సంచలన తీర్పు!
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులు భారీ వర్షాలు! 3 తుపాన్లు, 1 అల్పపీడనం - గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో!
DSC: ప్రతిపక్ష సభ్యులకూ ఆహ్వానం.. డిఎస్సీ వేడుకలో అన్ని వర్గాల సమ్మేళనం.. మంత్రి లోకేష్!
GST: చిన్న వ్యాపారాల కోసం సూపర్ సులభతలు! జీఎస్టీ యాన్యువల్ రిటర్న్స్ కేంద్రం మినహాయింపు!