అన్నమయ్య జిల్లా రాజంపేటకు మద్దిపట్ల ఇందిర నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ గ్రామంలో సర్వే నెం. 887లో 887/2, 887/3, 887/4, 887/5 సబ్ డివిజన్లలో తమకు వారసత్వ రీత్యా, కొనుగోలు ద్వారా వచ్చిన భూమి కలదు.
887/4 సర్వే నెంబర్ లో ఉన్న భూమిని 2005లో కొనుగోలు చేశాం. ఈ భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించడానికి అనేక విధాలుగా బెదిరించి గత ప్రభుత్వంలో తమపై అక్రమ కేసు పెట్టి భూమి కాజేయడానికి ప్రయత్నించారు. దీనిపై ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తే ఆక్రమణను ఆపేశారు.
మళ్లీ ఇప్పుడు వారు తమ భూమిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. రాజంపేటలో తమపై అక్రమ కేసు పెట్టి మరోసటి రోజు తమ భూమి ప్రహరీని కూల్చివేశారు. కూల్చివేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుకి అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడు మండలం మొతయిపల్లె గ్రామానికి చెందిన ముప్పురి మార్కండేయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని సర్వే నెం.2726-10లో 42 సెంట్లు భూమి కలదు. 1995లో ముపూరి కొండయ్య కొనుగోలు చేసిన భూమి ఆ భూమిలో తమ పూర్వీకులు సమాధి కూడా ఉండడంతో తమ కుటుంబం ఆచారం ప్రకారం చూసుకుంటూ వస్తోంది.
కానీ షేర్ హుస్సెన్ ఫీరా కుమారుడు షేక్ యూసఫ్ గత ప్రభుత్వంలో వాలంటీర్ గా పనిచేస్తూ అక్రమంగా ఆన్ లైన్ లో భూమిని తమ పేరుమీద నమోదు చేసుకున్నాడు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావునా తమయందు దయవుంచి తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగం గ్రామానికి చెందిన కమలశేషు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని సర్వే నెం.100 లో పొరంబోకు భూమి ఉంది. అందులో కొంతమందికి డీపట్టాలు ఇచ్చారు.
వారి వద్ద నుంచి నువులు కరుణ కొనుగోలు చేసి ఆ యొక్క స్థలంలో కమర్షియల్ బిల్డింగ్ 3 ఫ్లోర్లు కట్టారు. దీనిపై కలెక్టర్ గ్రీవెన్స్ వెళ్లగా అది పొరంబోకు భూమి అని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ మండల తహసీల్దార్ వారితో చేతులు కలిపి చర్యలు తీసుకోవడం లేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని సమస్యను పరిష్కరించాలని కోరాడు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన అబ్దుల్ మునాఫ్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నెం.146c1లో ఎ.2.14 సెంట్లు, 146c1లో కె. మహమ్మద్ గౌస్ కి 0.39 సెంట్లు భూమి కలదు. ఈ భూమిని కె.తారశ్రీ , కె.మహమ్మద్ రసాల్, కె. ఇబ్రహీం, బుడగజంగం ధూపం రంగన్న కుటుంబం దొంగ పత్రాలతో తమ పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఈ అక్రమ రిజిస్ట్రేషన్లకు ఎమ్మిగనూరు సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు కూడా సహకరించారు. వారిపై చర్యలు తీసుకోని తమ భూమిని తమకు ఇప్పించాలని కోరాడు. అనకాపల్లి జిల్లా కుంచంగి గ్రామానికి చెందిన సూర్య జగ్గారావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..
మాజీ సైనిక ఉద్యోగిని తమ గ్రామంలో తనకు సర్వే నెం.385/2లో య.4.50 సెంట్లు ప్రభుత్వ భూమి ఢీపారం పట్టా ఇచ్చారు. సదరు భూమికి తనకు ఎన్వోసీ ఇప్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్ కి విన్నవించినా తనకు న్యాయం జరగలేదు. కావునా తమయందు దయవుంచి తమ సమస్యను పరిష్కరించాలని అభ్యర్ధించాడు.