Ocean Gold Mines: మహాసముద్రాల్లో దాగి ఉన్న 20 మిలియన్ టన్నుల బంగారం! ఎక్కడ నుండి వచ్చిందో తెలుసా!

దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభమైన వేళ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తమ వార్షిక ఫెస్టివ్ బొనాంజా ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా కస్టమర్లు విభిన్న రంగాల్లోని ఉత్పత్తులు, సేవలపై భారీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ట్రావెల్, కిరాణా, ఫర్నిచర్, డైనింగ్ తదితర విభాగాల్లో రూ.50,000 వరకు తగ్గింపులు లభిస్తాయని బ్యాంక్ ప్రకటించింది. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డ్‌లెస్ ఈఎంఐలు, కన్స్యూమర్ ఫైనాన్స్ ద్వారా కస్టమర్లు ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చని వివరించింది. అదనంగా నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

StateDebts: రాష్ట్రాలపై అప్పుల ముంపు..! 10 ఏళ్లలో మూడింతలు పెరిగిన రుణభారం..!

కస్టమర్లకు విస్తృతమైన ఆఫర్లు అందించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ అనేక ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆపిల్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, వన్‌ప్లస్, మేక్‌మైట్రిప్, గోయిబిబో, యాత్ర, బ్లింకిట్, స్విగ్గీ, అజియో, పెప్పర్‌ఫ్రై వంటి ప్రముఖ బ్రాండ్లు ఇందులో భాగం అయ్యాయి. ప్రత్యేకించి సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఐసీఐసీఐ కస్టమర్లకు అదనంగా 10% తగ్గింపు లభిస్తుంది. మొబైల్ విభాగంలో ఐఫోన్ 17 కొనుగోలుపై రూ.6,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, వన్‌ప్లస్‌పై రూ.5,000 వరకు తగ్గింపు, నథింగ్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ.15,000 వరకు తగ్గింపులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎల్‌జీ, హైయర్, పానసోనిక్ వంటి బ్రాండ్లపై రూ.50,000 వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది.

H-1b Visa: ట్రంప్ ప్రకటనతో అమెరికా ఎయిర్‌పోర్టుల్లో ఉద్రిక్త వాతావరణం..ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రశ్నార్థకం?

ఫ్యాషన్ విభాగంలో టాటా క్లిక్, అజియో వంటి ప్లాట్‌ఫారమ్‌లపై 10%–15% డిస్కౌంట్ లభిస్తుంది. ట్రావెల్ విభాగంలో మేక్‌మైట్రిప్, గోయిబిబో, యాత్ర, ఈజ్‌మైట్రిప్, ఇక్సిగో, పేటీఎం ఫ్లైట్స్ ద్వారా బుక్ చేసిన విమాన టికెట్లు, హోటల్స్, హాలిడే ప్యాకేజీలపై రూ.10,000 వరకు తగ్గింపులు ఉన్నాయి. కిరాణా కోసం బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో తగ్గింపులు లభిస్తాయి. గృహ అవసరాల విభాగంలో పెప్పర్‌ఫ్రై, లివ్‌స్పేస్, ది స్లీప్ కంపెనీపై 35% వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అదనంగా స్విగ్గీ, ఈజీడైనర్, బిర్యానీ బై ది కిలో, డిస్ట్రిక్ట్ వంటి డైనింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు.

Sanjeevani Scheme: ఏపీ ప్రభుత్వం కొత్త పథకం! ఇంటి వద్ద నుండి ఆ సేవలు... ఒక్కో కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు...

వస్తువుల తగ్గింపులతో పాటు రుణాలపై కూడా ఐసీఐసీఐ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. జీతం పొందే కస్టమర్లకు గృహ రుణాలపై కేవలం రూ.5,000 ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ ఆఫర్ డిసెంబర్ 15 వరకు కొనసాగుతుంది. ఆటో లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు రూ.999 మాత్రమే ఉండగా, ఇది అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు 9.99% నుండి ప్రారంభమవుతాయి, ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు చెల్లుతుంది. సెక్యూరిటీలపై రుణాల కోసం రూ.20 లక్షల వరకు ప్రాసెసింగ్ ఫీజు రూ.1,000 మాత్రమే. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ ఝా మాట్లాడుతూ, “కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫెస్టివ్ బొనాంజా ఆఫర్లను రూపొందించాం. ప్రతి కస్టమర్ తమ సమీప బ్రాంచ్ లేదా ఆన్‌లైన్ ద్వారా వీటిని వినియోగించుకోవచ్చు” అని తెలిపారు.

AP News: ఆవుపేడలో దాగి ఉన్న సంపద – స్వయం సహాయక సంఘాలకి సువర్ణావకాశం!
Vahanamitra: వాహన మిత్ర దరఖాస్తులో సమస్యలా! వెంటనే ఈ పని చేయండి! రెండు రోజులే ఛాన్స్!
H-1B Visa Fee Hike: ట్రంప్ షాకింగ్ డెసిషన్! సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఎన్నారైల లో ఆందోళనలు!
Cashews: ఈ సమస్య ఉన్నవారు జీడిపప్పు తింటే లాభమా... నష్టమా!
Caravon Park: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఏపీలో కొత్తగా కారవాన్ పార్కులు! ఆ జిల్లా దశ తిరిగినట్లే!
Bhagavad Gita: భయాలు, బాధలు లేని జీవనానికి భగవత్ అనుగ్రహం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 9!