ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకల ఆరోపణలపై అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధుసూదన్‌కు హైకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. వీరిద్దరూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను సోమవారం హైకోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి ఈ కేసు విచారణ చేపట్టి, కేసు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నదని, నిందితులపై ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొన్నారు. వీరు సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశమున్నదని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేయలేమని తేల్చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ సాయి రోహిత్ వాదిస్తూ, పీఎస్‌ఆర్ కార్యదర్శిగా ఉన్నప్పుడు మ్యాన్యువల్ మూల్యాంకనానికి హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్ ఉపయోగించడం, రూ.1.14 కోట్లు క్యామ్‌సైన్‌కు చెల్లించడం వంటి అంశాలను ప్రస్తావించారు.
ఇది కూడా చదవండి: ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
ఇక అనారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటూ పీఎస్‌ఆర్ తరఫు న్యాయవాది మెడికల్ బెయిల్ కోరారు. హైకోర్టు దీనిపై స్పందిస్తూ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పీఎస్‌ఆర్‌ను పర్యవేక్షణలో ఉంచాలనుకున్నప్పటికీ, ఆయన ఆసుపత్రిని స్వచ్ఛందంగా వదిలిపెట్టినట్లు నమోదు చేయడంతో, మెడికల్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకునేందుకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు పేర్కొంది. దీనిపై రెండు వారాల్లోగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని విజయవాడ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఇక మధుసూదన్ బెయిల్ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది, తద్వారా ఈ ఇద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగనున్నారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ భారీ ప్రాజెక్టు పై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! మహారాష్ట్ర ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రి!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.50 లక్షల విరాళం...
ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..
ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!
ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!
ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..
చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!
మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!
రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?
ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: