కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపిన మధురమైన క్షణాలను చాలా మంది తమ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోవడం ఇష్టం పడుతుంటారు. ముఖ్యంగా ఫోటోలు, వీడియోల రూపంలో ఆ క్షణాలను అందరితో పంచుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. అయితే, ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా స్టేటస్ అప్‌డేట్ చేయాల్సి వచ్చేది.
మరెవరికైనా నాలుగు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఫోటోలను ఒకేసారి ఒకే స్టేటస్‌గా పెట్టాలంటే? ఇప్పటివరకు దానికి సులభమైన మార్గం ఉండేది కాదు. థర్డ్ పార్టీ యాప్‌లు వాడి ఫోటోలను కలిపి, కొలేజ్ రూపంలో తయారు చేసి, ఆ తర్వాత వాట్సాప్ స్టేటస్‌లో అప్‌లోడ్ చేయాల్సి వచ్చేది. ఇది కొంత సమయం తీసుకునే పని.
ఇప్పుడు ఆ ఇబ్బంది తప్పనుంది. వాట్సాప్ తాజాగా కొలేజ్ క్రియేట్ చేసే బిల్ట్-ఇన్ ఎడిటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అంటే, స్టేటస్ అప్‌డేట్ చేస్తున్నప్పుడు మీరు గ్యాలరీ నుంచి ఒకేసారి ఆరు ఫోటోలు వరకు ఎంపిక చేసుకోవచ్చు. ఆపై “Layout” అనే కొత్త ఆప్షన్ ద్వారా వాటిని మీకు నచ్చిన డిజైన్‌లో కొలేజ్‌గా మార్చుకోవచ్చు.

ఇది ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న సౌకర్యాన్ని పోలి ఉంటుంది. ముఖ్యమైన ఈవెంట్‌కు సంబంధించిన అన్ని ఫోటోలను ఒకే స్టేటస్‌లో అందంగా సెట్ చేసుకోవచ్చు. దీంతో స్టేటస్ మరింత ఆకర్షణీయంగా కనిపించడమే కాక, చూడబోయేవారికి కూడా ఆ క్షణాల పూర్తి అనుభూతి వస్తుంది.
ఇటీవల వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ యాడ్ చేసే సదుపాయం కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కొలేజ్ ఫీచర్‌తో పాటు మ్యూజిక్ స్టిక్కర్లు, ఫోటో స్టిక్కర్లు వంటి కొత్త ఫీచర్లను కూడా త్వరలో ప్రవేశపెట్టబోతుంది.
ప్రస్తుతం కొందరికి మాత్రమే ఈ కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. మిగిలిన యూజర్లకు రాబోయే రోజుల్లో అప్‌డేట్ రూపంలో వస్తుంది. కాబట్టి, త్వరలోనే అందరూ ఈ సదుపాయం ఉపయోగించి, తమ స్టేటస్‌ను మరింత క్రియేటివ్‌గా మార్చుకోవచ్చు.