భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల ప్రతిష్టంభన నేపథ్యంలో చర్చలు ఊపందుకున్నాయని, రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదిరిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) ఎనిమిదో వార్షిక సదస్సులో పాల్గొన్న లుట్నిక్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. "భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సమీప భవిష్యత్తులోనే కుదురుతుందని మీరు ఆశించవచ్చు" అని అన్నారు. ట్రంప్ ప్రభుత్వం వాణిజ్య ఒప్పందాలను వేగవంతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వాణిజ్య లోటుకు కారణమవుతున్నాయన్న ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, చైనా మినహా ఇతర దేశాలపై ఈ సుంకాలను జూలై 8 వరకు 90 రోజుల పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో తమ వస్తువులపై అమెరికా విధించిన 26 శాతం అదనపు సుంకం నుంచి భారత్ పూర్తి మినహాయింపు కోరుతోంది. ఈ నేపథ్యంలో జూలై 8 లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో లుట్నిక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
నిన్న భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారత్, అమెరికా పరస్పరం ఒకరి వ్యాపారాలకు మరొకరు ప్రాధాన్యంతో కూడిన మార్కెట్ ప్రవేశం కల్పించాలని కోరుకుంటున్నాయని, ఇరు దేశాల బృందాలు ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. కాగా, ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం ఈ వారం భారత్‌లో పర్యటిస్తోంది. గత నెలలో, భారత ప్రధాన సంప్రదింపుల అధికారి, వాణిజ్య విభాగం ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వాషింగ్టన్‌లో నాలుగు రోజుల పర్యటన ముగించారు. వాణిజ్య చర్చలకు మరింత ఊతమిచ్చేందుకు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇటీవల వాషింగ్టన్‌లో పర్యటించారు.
ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: