రాష్ట్రంలోని రైతులు ఎక్కువగా వరి పంటపై ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరి సాగు ప్రతి ఏటా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వరదలు, చీడపీడలు వంటి ప్రకృతి ప్రకోపాలు రైతులకు భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఇలా వరి పంటల వల్ల జరుగుతున్న నష్టాలను తగ్గించడానికి , వ్యవసాయంలో స్థిరమైన ఆదాయాన్ని కల్పించేందుకు జిల్లా ఉద్యానశాఖ అధికారులు ఒక కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉద్యానశాఖ అధికారులు వరి పంటకు బదులుగా బహుళ వార్షిక పంటలవైపు, ముఖ్యంగా ఆయిల్‌పాం సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇది ఒక దీర్ఘకాలిక పంటగా నిలిచే అవకాశం ఉండటంతో పాటు మార్కెట్ డిమాండ్ కూడా పెరుగుతోంది. ఆయిల్‌పాం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. రైతుల్లో చైతన్యం నింపేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయిల్‌పాం సాగుతో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. బోర్లు ఉన్న భూభాగాల్లో ఈ పంటకు నీరు అందుబాటులో ఉండటంతో ఆయిల్‌పాం సాగుకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వాడుతుంటే అలర్ట్.. రూల్స్ మారుతున్నాయి! 50 సార్ల వరకు మాత్రమే..

రైతులు ఆయిల్‌పాం సాగుపై ఆసక్తి చూపేలా ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. మొక్కల సరఫరా, నీటి వనరుల అభివృద్ధి, పంట ఇన్సూరెన్స్, సాంకేతిక సహాయం వంటి అంశాల్లో రాయితీలు అందించనున్నారు. ఆయిల్‌పాం సాగుకు అనుకూలమైన భూములను గుర్తించి రైతులను ఎంపిక చేస్తున్నారు. కాకినాడలో మెట్ట భూముల్లో బోర్లపై ఆధారపడి వరి, కూరగాయలు, మల్బరీ, పత్తి వంటి వాణిజ్య పంటలు సాగుచేస్తున్న రైతులు ఇటీవల వరుసగా నష్టాలు ఎదుర్కొంటున్నారు. వరి వంటి సీజనల్ పంటలతో స్థిరమైన ఆదాయం లభించకపోవడంతో, ఉద్యానశాఖ అధికారులు రైతులకు ఒక దీర్ఘకాలిక పరిష్కారాన్ని సూచిస్తున్నారు ఆయిల్‌పాం సాగు. ఈ ఏడాది ఆయిల్‌పాం సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా: పిఠాపురం: 3,050 హెక్టార్లు, పెద్దాపురం: 2,133.50 హెక్టార్లు, తుని: 2,222.40 హెక్టార్లు , శంఖవరం: 1,825 హెక్టార్లు, జగ్గంపేట: 2,347 హెక్టార్లు, ప్రత్తిపాడు: 2,129 హెక్టార్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాంతాల్లో ఆయిల్‌పాం సాగు వేయించేందుకు ఇప్పటికే కృషి ప్రారంభమైంది. రైతులకు నర్సరీల నుంచి మొక్కల సరఫరా, సాంకేతిక మార్గదర్శనం వంటి అనేక అంశాల్లో మద్దతు అందిస్తున్నారు. ప్రస్తుతం పామాయిల్‌కు దేశంలో డిమాండ్ అధికంగా ఉండటంతో, పెద్దమొత్తంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: తస్మా జాగ్రత్త.. ఇలాంటి మొక్కలు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నాయా! పాములను ఆకర్షించే 7 మొక్కలు..

ఇటువంటి పరిస్థితిలో ఆయిల్‌పాం స్థానికంగా పండితే, రైతులకు స్థిరమైన ఆదాయం లభించడమే కాదు, దేశానికి కూడా దీర్ఘకాలికంగా లాభంగా ఉంటుంది. ఒక్క హెక్టార్ భూమిలో 57 ఆయిల్‌పాం మొక్కలు నాటవచ్చు. ఈ మొక్కలను నాటేందుకు అవసరమైన మొత్తం రూ.29,000 ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. రైతులు దీని ద్వారా మొదటి దశ వ్యయభారం లేకుండానే సాగు ప్రారంభించవచ్చు.నాలుగేళ్ల పాటు వార్షిక రాయితీలు ఉన్నాయి. రైతులు తమ భూమిలో మొక్కల సంరక్షణ, ఎరువుల ఖర్చులకు భయపడకుండా ఉండేందుకు ప్రభుత్వమే భుజాన వేసుకుంటోంది. మొక్కల సంరక్షణ , ఎరువుల ఖర్చులకు ప్రతి సంవత్సరం రూ.5,200 చొప్పున నాలుగేళ్లపాటు అందించనున్నారు. మొక్కల మధ్య ఖాళీ ప్రాంతాన్ని ఉపయోగించుకొని అంతర పంటలు వేయాలన్న ఉద్దేశంతో, అదనంగా ప్రతి సంవత్సరం మరో రూ.5,200 చొప్పున నాలుగేళ్లపాటు మద్దతు ఇవ్వనున్నారు. ఈ మొత్తం రాయితీలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనుంది. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సకాలంలో డాక్యుమెంటేషన్ పూర్తి చేసి నమోదు చేసుకున్న రైతులకు నిధులు మంజూరవుతాయి. పిఠాపురం ఉద్యానశాఖాధికారిణి శైలజ ప్రకారం.. రైతులకు ఆయిల్‌పాం సాగుపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీల గురించి తెలుసుకున్న చాలా మంది సాగుకు ముందుకు వస్తున్నారని వివరించారు. ఆయిల్‌పాంలో అంతర పంటలు కూడా రాయితీలు ఉన్నాయి, సద్వినియోగం చేసుకోవాలి కోరారు.

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group