LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Opinion

Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు!

Celebrity Couples: జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో ఉన్న బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అతని దగ్గర తాను ఎంత సురక్షితంగా భావిస్తారో వివరిస్తూ, తన ఫ్యామిలీతో శిఖర్‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

AndhraPravasi News Desk 2 min read
Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు!

Celebrity Couples: బాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి  కుమార్తె జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడానికి ఆమె వెనుకాడదు. గత కొంతకాలంగా జాన్వీ కపూర్, శిఖర్ పహారియాతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఈ జంట జంటగా కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించని జాన్వీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టింది.

శిఖర్‌తో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ.. అతని దగ్గర తాను చాలా ప్రశాంతంగా, చిన్నపిల్లలా ఉంటానని జాన్వీ చెప్పుకొచ్చింది. "ప్రేమ అనేది మనల్ని మనం సరికొత్తగా చూసుకునేలా చేస్తుంది. శిఖర్ దగ్గర ఉన్నప్పుడు నాకు చాలా భద్రతగా అనిపిస్తుంది. నా ఆలోచనలను పంచుకోవడానికి, ఒక చిన్న పాపలా అల్లరి చేయడానికి అతను నాకు ఇచ్చే వెసులుబాటు మరెక్కడా దొరకదు. నిజం చెప్పాలంటే అతనితో గడిపే సమయమే నాకు అత్యంత సంతోషకరమైనది అంటూ జాన్వీ   చెప్పుకొచ్చింది. 

శిఖర్ పహారియా కేవలం జాన్వీకే కాకుండా ఆమె కుటుంబ సభ్యులకు కూడా చాలా సన్నిహితుడని తెలుస్తోంది. గతంలో కరణ్ జోహార్ షోలో పాల్గొన్నప్పుడు కూడా జాన్వీ ఇదే విషయాన్ని ప్రస్తావించింది. తన తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్‌లతో కూడా శిఖర్ మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారని, ఎటువంటి స్వార్థం లేకుండా తమ కుటుంబానికి అండగా నిలబడ్డారని ఆమె ప్రశంసించింది. ఒక మనిషి మరొకరి కోసం అంత నిస్వార్థంగా ఉండటం చాలా అరుదని, శిఖర్ ప్రవర్తన తనకు ఎంతో నచ్చిందని ఆమె పేర్కొంది.

ఇక కెరీర్ విషయానికి వస్తే, జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె టైగర్ ష్రాఫ్ సరసన 'లగ్ జా గలే' అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తోంది. ముంబైలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాకుండా, ఆమె నటించిన 'హోమ్ బౌండ్' సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల రేసులో నిలవడం జాన్వీ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా చెప్పవచ్చు. పెద్ది సినిమాలో కూడా త్వరలో విడుదల కానుంది తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే, కమర్షియల్ హిట్లను కూడా తన ఖాతాలో వేసుకోవాలని ఆమె చూస్తోంది.

 సినిమాలతో, ఇటు వ్యక్తిగత విషయాలతో జాన్వీ కపూర్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. శిఖర్ పహారియాతో తన ప్రేమ వ్యవహారంపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారా? లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తుంటే, రాబోయే రోజుల్లో తెలుగు, హిందీ ప్రేక్షకులను అలరించడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 

Be the first to react

More Coverage

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: తన ప్రియురాలికి ఖరీదైన ఐఫోన్‌ను కానుకగా ఇచ్చేందుకు ఓ మైనర్ బాలుడు ఏకంగా రూ.11.39 లక్షల విలువ…

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: వరంగల్‌కు చెందిన యువ గాయకుడు చోటు (శివకుమార్) సాధించిన ఆరు ప్రపంచ రికార్డుల గురించిన…