Caravon Park: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఏపీలో కొత్తగా కారవాన్ పార్కులు! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్-1బీ వీసా ఫీజు పెంపు పై ప్రకటన చేశారు. వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ చేసిన ఈ నిర్ణయం ఎన్నారైలు, ముఖ్యంగా భారతీయ టెక్ ఉద్యోగుల్లో పెద్ద కలకలం రేపింది. కొత్త నిబంధనలు సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో అమెరికాలోని అనేక సంస్థలు తమ విదేశీ ఉద్యోగులను వెంటనే తిరిగి రావాలని ఆదేశించాయి.

Machilipatnam Port: మచిలీపట్నం పోర్టు.. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్‌చేంజర్!

ఈ ప్రకటన ప్రభావంతో భారత్-అమెరికా విమాన టిక్కెట్ల ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే టిక్కెట్లు రెట్టింపై రూ.80 వేలకు చేరుకున్నాయి. ఇప్పటికే సీట్లు బుక్ చేసుకున్న ఎన్నారైలలో కొందరు విమానం ఎక్కిన తర్వాత ఈ ప్రకటన గురించి తెలిసి దిగిపోయారని వార్తలు వస్తున్నాయి. దుబాయ్ సహా ఇతర ఎయిర్‌పోర్టుల్లో కూడా ఇలాంటి సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.

Movie Update: డిఫరెంట్ స్టైల్‌లో కాంతార ట్రైలర్ లాంచ్… ఇది ఎక్కడ మాస్ ప్రమోషన్స్ అంటున్న ఆడియన్స్!

ట్రంప్ నిర్ణయం ప్రకారం, సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 12.01 లోపు అమెరికాకు చేరుకోని వీసాదారులు ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదంలో పడతారు. తమ ఉద్యోగులను కాపాడుకోవడానికి అమెజాన్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గన్ వంటి ప్రముఖ సంస్థలు వీసా కలిగిన వారిని అమెరికా వీడొద్దని కఠినంగా హెచ్చరించాయి. దీంతో భారత్‌లో దసరా పండుగకు వచ్చిన ఎన్నారైలు మరియు ఇతర దేశాల్లో విహారయాత్రలకు వెళ్లిన వారు పెద్ద చిక్కుల్లో పడ్డారు.

Dark Chocolate: డార్క్ చాక్లెట్.. కేవలం రుచి కాదు, ఆ సమస్యకు ఒక ఔషధం! ఒక రోజుకు ఎంత తినాలో తెలుసా.?

అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు కూడా ఈ పరిణామంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "సెప్టెంబర్ 21 డెడ్‌లైన్ మిస్ అయితే ఉద్యోగాలు సీరియస్ సమస్యలో పడతాయి" అని అమెరికా ఇమిగ్రేషన్ లాయర్ సైరస్ మెహతా స్పష్టం చేశారు. దీంతో ఎన్నారైలలో ఆందోళన మరింత పెరిగింది. విమానాల డిమాండ్ పెరగడంతో టిక్కెట్ ధరలు సాధారణ కుటుంబాలకు అందని స్థాయికి చేరుకున్నాయి.

AP Rains Update: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ 10 జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! రాగల 3 గంటల్లో..

మొత్తానికి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నారైలు, ముఖ్యంగా భారతీయ టెక్ కమ్యూనిటీని తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టింది. ఒకవైపు వీసా ఫీజు భారంతో ఇబ్బంది, మరోవైపు అకస్మాత్తుగా పెరిగిన విమాన ఛార్జీలు ఎన్నారైల జీవనాన్ని తలకిందులు చేస్తున్నాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఇండియా-అమెరికా సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

Bhagavad Gita: భయాలు, బాధలు లేని జీవనానికి భగవత్ అనుగ్రహం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 9!
Cashews: ఈ సమస్య ఉన్నవారు జీడిపప్పు తింటే లాభమా... నష్టమా!
Tirupati: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దసరా కానుకగా.. కేవలం గంటన్నరలో తిరుపతికి వెళ్లొచ్చు! ఎలాగో తెలుసా!
Beer Bottle: బీరు ప్రియులకు షాకింగ్ నిజం.. బీరు బాటిళ్ల రంగులు కేవలం డిజైన్ కాదు.. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు!
H1B visa rules: H1B వీసా నిబంధనపై స్పందించిన భారత్.. వీసా పరిమితులు అమెరికా ఆర్థిక వ్యవస్థకే దెబ్బ!