Vahanamitra: వాహన మిత్ర దరఖాస్తులో సమస్యలా! వెంటనే ఈ పని చేయండి! రెండు రోజులే ఛాన్స్!

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పంచాయతీరాజ్‌, పురపాలక శాఖలపై సమీక్ష నిర్వహించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. దుబాయ్‌లో ఆవుపేడకు డిమాండ్‌ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. మొదట వినగానే ఇది ఆశ్చర్యంగా అనిపించినా… నిజంగానే అక్కడ ఆవుపేడకు గిరాకీ ఎక్కువగా ఉంది.

H-1B Visa Fee Hike: ట్రంప్ షాకింగ్ డెసిషన్! సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఎన్నారైల లో ఆందోళనలు!

నిజానికి మనం ఇక్కడ ఆవుపేడను కేవలం ఇంధనం లేదా ఇంటి చుట్టూ ఉపయోగించుకునే పదార్థంగా మాత్రమే భావిస్తాం. కానీ గల్ఫ్ దేశాల్లో దీని విలువ పూర్తిగా వేరే విధంగా ఉంది. ముఖ్యంగా దుబాయ్‌, కువైట్‌, సౌదీ అరేబియా వంటి దేశాలు మన దేశం నుంచి పెద్ద మొత్తంలో ఆవుపేడను దిగుమతి చేసుకుంటున్నాయి.

Cashews: ఈ సమస్య ఉన్నవారు జీడిపప్పు తింటే లాభమా... నష్టమా!

దీనికి ప్రధాన కారణం అక్కడి వ్యవసాయం. ఎడారి వాతావరణం ఉండటంతో భూమి సారవంతం చేయడం చాలా కష్టం. ముఖ్యంగా ఖర్జూర పంట సాగులో మట్టి సారాన్ని పెంచడం ఒక పెద్ద సమస్య. అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధన చేసి, ఆవుపేడను పొడి రూపంలో ఎరువుగా వాడితే పంట దిగుబడి పెరుగుతుందని, ఖర్జూర పండ్ల పరిమాణం కూడా ఎక్కువ అవుతుందని గుర్తించారు.

Caravon Park: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఏపీలో కొత్తగా కారవాన్ పార్కులు! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

ఆవుపేడలో ఉండే నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం వంటి పోషకాలు పంటలకు బాగా ఉపయోగపడతాయి. రసాయన ఎరువుల కంటే పర్యావరణహితంగా ఉండటంతో, అక్కడి రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించారు. దీంతో ఆవుపేడకు డిమాండ్‌ మరింత పెరిగింది.

Bhagavad Gita: భయాలు, బాధలు లేని జీవనానికి భగవత్ అనుగ్రహం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 9!

2023-24 ఆర్థిక సంవత్సరంలోనే మన దేశం నుంచి దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన ఆవుపేడ ఉత్పత్తులు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయినట్లు సమాచారం. అందులో దుబాయ్ ప్రధాన మార్కెట్‌గా మారింది.

Movie Update: డిఫరెంట్ స్టైల్‌లో కాంతార ట్రైలర్ లాంచ్… ఇది ఎక్కడ మాస్ ప్రమోషన్స్ అంటున్న ఆడియన్స్!

ఇక్కడ మనం వేస్ట్‌ గా భావించే  అక్కడ వెల్త్‌ గా మారుతోంది. ఇదే నేటి ట్రెండ్‌  ఏది వృథా కాదు, అన్నీ ఉపయోగకరమే అని చంద్రబాబు గారు చెప్పిన మాటలు వాస్తవమేనని మన రైతులు గ్రహించినప్పుడు ఎటువంటి పెట్టుబడి లేకుండా   స్వయం సహాయక సంఘాలు ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటే, ఇది మనకు మంచి ఆదాయం తెచ్చిపెట్టే రంగంగా మారొచ్చు అని  విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Machilipatnam Port: మచిలీపట్నం పోర్టు.. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్‌చేంజర్!
Dark Chocolate: డార్క్ చాక్లెట్.. కేవలం రుచి కాదు, ఆ సమస్యకు ఒక ఔషధం! ఒక రోజుకు ఎంత తినాలో తెలుసా.?
AP Rains Update: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ 10 జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! రాగల 3 గంటల్లో..
Tirupati: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దసరా కానుకగా.. కేవలం గంటన్నరలో తిరుపతికి వెళ్లొచ్చు! ఎలాగో తెలుసా!