H-1b Visa: ట్రంప్ ప్రకటనతో అమెరికా ఎయిర్‌పోర్టుల్లో ఉద్రిక్త వాతావరణం..ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రశ్నార్థకం?

దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా అప్పుల బరువుతో నలిగిపోతున్నాయని, గత పదేళ్లలో వాటి రుణభారం మూడు రెట్లు పెరిగిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ (కాగ్) విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేసింది. తొలిసారి విడుదల చేసిన దశాబ్ద ఆర్థిక విశ్లేషణలో రాష్ట్రాల బడ్జెట్లలో ఎక్కువ భాగం వడ్డీలు, అప్పుల చెల్లింపులకే వెళ్తోందని పేర్కొంది. ఈ నివేదికను కాగ్ అధిపతి కె.సంజయ్ మూర్తి రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమావేశంలో విడుదల చేశారు.

Sanjeevani Scheme: ఏపీ ప్రభుత్వం కొత్త పథకం! ఇంటి వద్ద నుండి ఆ సేవలు... ఒక్కో కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు...

2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 28 రాష్ట్రాల మొత్తం అప్పులు రూ.17.57 లక్షల కోట్లు ఉండగా, 2022-23 నాటికి అవి రూ.59.60 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే పదేళ్ల వ్యవధిలో రాష్ట్రాల అప్పులు 3.3 రెట్లు పెరిగినట్టుగా నివేదికలో స్పష్టమైంది. దీనివల్ల రాష్ట్ర బడ్జెట్‌లో అభివృద్ధి, పెట్టుబడుల కోసం కేటాయింపులు తగ్గిపోయి, ఎక్కువ మొత్తంలో వడ్డీలు, రుణ చెల్లింపులకే కేటాయింపులు జరుగుతున్నాయని కాగ్ హెచ్చరించింది.

AP News: ఆవుపేడలో దాగి ఉన్న సంపద – స్వయం సహాయక సంఘాలకి సువర్ణావకాశం!

అప్పులను ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులకు కాకుండా, రోజువారీ ఖర్చులకు, రెవెన్యూ లోటు పూడ్చుకోవడానికే వినియోగిస్తున్నట్లు కాగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు పాటించాల్సిన “గోల్డెన్ రూల్”ను ఉల్లంఘిస్తున్నాయని తేల్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు సహా 11 రాష్ట్రాలు రుణాలను తప్పుగా వినియోగిస్తున్నాయని నివేదికలో పేర్కొంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో నికర రుణాల్లో కేవలం 26 శాతం మాత్రమే మూలధన వ్యయాలకు వెచ్చించబడిందని వివరించింది.

Vahanamitra: వాహన మిత్ర దరఖాస్తులో సమస్యలా! వెంటనే ఈ పని చేయండి! రెండు రోజులే ఛాన్స్!

రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)తో పోల్చినప్పటికీ రుణాల నిష్పత్తి ఆందోళనకరంగా పెరుగుతోందని కాగ్ హెచ్చరించింది. 2023 నాటికి పంజాబ్ 40.35% రుణ నిష్పత్తితో అగ్రస్థానంలో ఉండగా, నాగాలాండ్ (37.15%), పశ్చిమ బెంగాల్ (33.70%) కూడా ఎక్కువ రుణ నిష్పత్తితో ఉన్నట్లు తేలింది. మరోవైపు ఒడిశా (8.45%), మహారాష్ట్ర (14.64%), గుజరాత్ (16.37%) రాష్ట్రాలు తక్కువ రుణ నిష్పత్తితో ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నాయని నివేదిక ప్రస్తావించింది. ఈ నివేదికపై కాంగ్రెస్ తీవ్ర ప్రతిస్పందన వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం నిర్బంధ సమాఖ్యవాదం ప్రదర్శిస్తూ రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరిస్తోందని ఆరోపించింది. జీఎస్టీ సెస్, ఏకపక్ష పన్నుల విధానం వల్లే రాష్ట్రాలు అప్పులపాలు అవుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా విమర్శలు గుప్పించారు.

H-1B Visa Fee Hike: ట్రంప్ షాకింగ్ డెసిషన్! సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఎన్నారైల లో ఆందోళనలు!
Cashews: ఈ సమస్య ఉన్నవారు జీడిపప్పు తింటే లాభమా... నష్టమా!
Caravon Park: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఏపీలో కొత్తగా కారవాన్ పార్కులు! ఆ జిల్లా దశ తిరిగినట్లే!
Bhagavad Gita: భయాలు, బాధలు లేని జీవనానికి భగవత్ అనుగ్రహం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 9!
Machilipatnam Port: మచిలీపట్నం పోర్టు.. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్‌చేంజర్!
Movie Update: డిఫరెంట్ స్టైల్‌లో కాంతార ట్రైలర్ లాంచ్… ఇది ఎక్కడ మాస్ ప్రమోషన్స్ అంటున్న ఆడియన్స్!