Smartphone Tip: మీ బ్యాటరీ ఎందుకు త్వరగా అయిపోతుందో తెలుసా..! అసలు కారణం ఇదే..!

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మండల పరిధిలోని 23 గ్రామాల్లో ఎన్నికలు జరపకూడదని తాత్కాలికంగా ఆదేశిస్తూ స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఈ ఆదేశాలతో వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది.

H-1B visa : అమెరికాలో హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజు.. విద్యార్థుల కోసం ఓపీటీ వీసా!

గతంలో ఈ 23 గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే గ్రామాలలో నివసిస్తున్న గిరిజనేతరులు ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి వాదన ప్రకారం, 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మంగపేట మండల పరిధిలో ఈ గ్రామాలు గిరిజన గ్రామాల జాబితాలో లేవని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కనపెట్టి నిజాం కాలం నాటి ఆర్డర్‌ను ఆధారంగా తీసుకోవడం సరైనది కాదని వారు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

Yuvraj Singh: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్.. ED విచారణకు హాజరైన యువరాజ్ సింగ్!

2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి నిజాం ఆర్డర్ ప్రకారం ఈ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణించాలని కోరగా, హైకోర్టు వారి వాదనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో సంతోషం లేకపోయిన గిరిజనేతరులు సుప్రీంకోర్టు ద్వారాన్ని తట్టారు. ఈ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణిస్తే తమ హక్కులు దెబ్బతింటాయని, ఎన్నికల ప్రక్రియలో అన్యాయం జరుగుతుందని వారు పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

ED: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో విచారణ..! యువరాజ్ సింగ్ ఈడీ ఎదుట హాజరు..!

ఈ వాదనలన్నింటిని పరిశీలించిన సుప్రీంకోర్టు, స్థానిక ఎన్నికల నిర్వహణపై తాత్కాలికంగా స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి విచారణ అనంతరం తుది తీర్పు ఇస్తామని తెలిపింది. దీంతో మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఈ నిర్ణయం స్థానిక రాజకీయ సమీకరణాలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనుంది.

దుబాయి పోలీసుల అదుపులో మోర్తాడ్ యువకుడు! ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు!
జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు ఇవే! రాష్ట్రపతి చేతుల మీదుగా!
IT Hub: విశాఖలో కొత్త IT క్యాంపస్! 12,000 ఉద్యోగ అవకాశాలతో కొత్త హబ్..!
Zubeen Gargs: జుబీన్ గార్గ్ అంత్యక్రియలు.. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు!
Honda Activa Scooty: హోండా యాక్టివా స్కూటీ.. ధర తెలిస్తే ఎగిరిగంతేస్తారు!
AP Passport: పాస్‌పోర్ట్ సేవల్లో విప్లవం! మొబైల్ వాహనంతో ఇంక నుంచే ఇంటికే..!