Tirumala first AI: దేశంలోనే తొలి AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్.. తిరుమలలో.. CBN!

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వర్షం కురుస్తోందని మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో ప్రకటించారు. గత 15 నెలల్లోనే రాష్ట్రానికి రూ.10.40 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు తెలిపారు. పరిశ్రమల విస్తరణతో పాటు ఉద్యోగ సృష్టి లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని లోకేష్ స్పష్టం చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభమైందని, గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిందని విమర్శించారు.

PM Kisan: రైతులకు పండుగ కానుక! మీ అకౌంట్ లో డబ్బులు .. ఎప్పుడంటే?

విశాఖపట్నంలో ఆర్సెలార్ మిత్తల్ భారీ ఉక్కు కర్మాగారం వచ్చే నవంబరులో ప్రారంభం కానుందని మంత్రి ప్రకటించారు. ఇప్పటికే పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం 25 కొత్త పాలసీలను అమల్లోకి తెచ్చిందని తెలిపారు. 340 ఎంవోయూలు కుదుర్చుకున్నామని, వాటి ద్వారా రూ.10.4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని వివరించారు. ఇంకా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. బీపీసీఎల్, ఎన్టీపీసీ, టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు.

త్వరలో మోడీ, ట్రంప్ బేటి! చర్చలు ద్వారా పరిష్కార మార్గాలు! జయశంకర్ న్యూయార్క్ లో పర్యటన!

అమరావతి క్వాంటమ్ వ్యాలీలో దక్షిణాసియాలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్‌ను ఐబీఎం ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. విద్యుత్ రంగంలో రెన్యూ, టాటా పవర్, ప్రీమియర్ ఎనర్జీ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. టూరిజం రంగంలో కూడా రాష్ట్రం వేగంగా ఎదుగుతోందని, తాజ్, ఐటీసీ వంటి ప్రముఖ హోటల్ సంస్థలు 6,000 గదులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయని వివరించారు. ఐదేళ్లలో 50,000 హోటల్ గదులను అందుబాటులోకి తేనన్నది ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. కర్నూలులో రిలయన్స్ పెద్ద ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తోందని చెప్పారు.

CM Chandrababu: బ్యాంకుల ఛైర్మన్‌లతో సీఎం చంద్రబాబు భేటీ..! పోర్టులు నుంచి క్వాంటం వ్యాలీ వరకు… అభివృద్ధి దిశగా..!

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, టీసీఎస్ ఒక్కటే విశాఖలో 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తోందని లోకేష్ ప్రతిపాదించారు. టీసీఎస్ వల్ల రాష్ట్రంలో ఏటా రూ.15,000 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, రూ.1,500 కోట్ల పన్ను రాష్ట్రానికి వస్తోందని వివరించారు. గూగుల్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తున్నాయని, మరో నెలలో ఇంకో పెద్ద టెక్ కంపెనీ కూడా రానుందని చెప్పారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వం పరిశ్రమలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని పరిశ్రమల హబ్‌గా మార్చిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం వాటిని తరిమేసిందని విమర్శించి, ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

AP Earthquake: ఏపీలో నిన్న అర్ధరాత్రి భూ ప్రకంపనలు! ఉలిక్కిపడ్డ ప్రజలు!
Weight Loss Tips: బరువు తగ్గాలని ఇవి తింటున్నారా! కానీ వారికి యమ డేంజర్!
తిరుమలలో నేటి నుండి సాలకట్ల బ్రహ్మోత్సవాలు! పాల్గొననున్న సీఎం చంద్రబాబు!
Praja Vedika: నేడు (24/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Road Development: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! ఆ రూట్ లో నాలుగు లైన్లుగా...డీపీఆర్ సిద్ధం! అక్కడికి తగ్గనున్న దూరం!
గుడ్ న్యూస్ ఆ దేశంలో కేవలం రూ. 12 వేల లోపే పర్మనెంట్ రెసిడెన్సీ అప్లికేషన్.! భారతీయ పౌరులు అర్హులే.!