Machilipatnam Port: మచిలీపట్నం పోర్టు.. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్‌చేంజర్!

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. అందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కారవాన్ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ కశ్మీర్‌గా ప్రసిద్ధి చెందిన లంబసింగి ప్రాంతంలో ఈ పార్క్‌ల ఏర్పాటు పై దృష్టి పెట్టింది. లంబసింగి సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ప్రతి ఏడాది వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చి, పర్యాటకులకు అదనపు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కారవాన్ పార్క్ ప్రాజెక్ట్‌ను ఆరంభించింది.

Movie Update: డిఫరెంట్ స్టైల్‌లో కాంతార ట్రైలర్ లాంచ్… ఇది ఎక్కడ మాస్ ప్రమోషన్స్ అంటున్న ఆడియన్స్!

ఈ ప్రాజెక్టు కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రత్యేకంగా ముందడుగు వేస్తున్నారు. లంబసింగి సమీపంలోని తాజంగి వద్ద సుమారు ఒక ఎకరా ప్రభుత్వ భూమిని గుర్తించి, కారవాన్ పార్క్‌కు కేటాయించారు. ఇప్పటికే పర్యాటక శాఖ సీనియర్ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించి, అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. జిల్లాలో మొత్తం ఐదు ప్రాంతాలను కారవాన్ పార్కుల కోసం ఎంపిక చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. వీటిలో పాడేరు డివిజన్‌లో మూడు, రంపచోడవరంలో రెండు ప్రాంతాలు ఉన్నాయి.

Dark Chocolate: డార్క్ చాక్లెట్.. కేవలం రుచి కాదు, ఆ సమస్యకు ఒక ఔషధం! ఒక రోజుకు ఎంత తినాలో తెలుసా.?

ప్రభుత్వం ఉద్దేశం కేవలం పర్యాటకులను ఆకర్షించడం మాత్రమే కాకుండా, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా. కారవాన్ పార్క్‌లలో వసతి సౌకర్యాలు, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక వసతులు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదనంగా వాకింగ్ ట్రాక్‌లు, సిట్-అవుట్ ప్రాంతాలు, క్రీడల కోసం కోర్టులు కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తూనే అవసరమైన సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది.

AP Rains Update: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ 10 జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! రాగల 3 గంటల్లో..

ఇక కారవాన్ టూరిజం పాలసీని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇతర రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేసింది. అరకు, భీమిలి వంటి ప్రముఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కారవాన్ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు ఉన్నాయి. ఈ వాహనాలు ఎప్పుడైనా నిలిపి విశ్రాంతి తీసుకునేలా, పర్యాటకులు గతంలో చూడని ప్రదేశాలను అనుభవించేలా సౌకర్యాలు కల్పించనున్నారు. దీని ద్వారా ఏపీ పర్యాటకానికి కొత్త రూపం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Tirupati: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దసరా కానుకగా.. కేవలం గంటన్నరలో తిరుపతికి వెళ్లొచ్చు! ఎలాగో తెలుసా!

మొత్తంగా, కారవాన్ పార్క్ ప్రాజెక్టు ద్వారా లంబసింగి వంటి ప్రకృతి సంపదతో నిండిన ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆకర్షితులవుతారు. అలాగే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకరంగం అభివృద్ధికి ఇది ఒక పెద్ద ముందడుగు అవుతుంది.

Beer Bottle: బీరు ప్రియులకు షాకింగ్ నిజం.. బీరు బాటిళ్ల రంగులు కేవలం డిజైన్ కాదు.. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు!
H1B visa rules: H1B వీసా నిబంధనపై స్పందించిన భారత్.. వీసా పరిమితులు అమెరికా ఆర్థిక వ్యవస్థకే దెబ్బ!
AP Govt’s: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! వారికి షాక్.. ఆ భూములు అన్ని వెనక్కి..!
Gold: ఏపీలో గోల్డ్ మైన్.. త్వరలో పసిడి ఉత్పత్తి.. ఏటా 750-1000 కిలోల బంగారం!
Bhagavad Gita: భయాలు, బాధలు లేని జీవనానికి భగవత్ అనుగ్రహం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 9!