ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, బీజేపీ తన వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. కూటమిలో భాగంగా కొనసాగుతూనే, ఏపీలో తన స్వంత శక్తిని బలపరచే దిశగా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాజ్యసభ స్థానాల విషయంలో బీజేపీ గట్టి పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఆర్.కృష్ణయ్యను ఎంపిక చేసిన బీజేపీ, తాజాగా సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటును కూడా తమకే దక్కించుకునే దిశగా స్పష్టమైన అప్రోచ్ తీసుకుంది. మొదటిసారిగా అనుమానాలున్నా, చివరకు బీజేపీ ఈ స్థానం నుంచి తమిళనాడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను ఎంపిక చేయనుందని సమాచారం.
తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, ఇప్పటికే అన్నాడీఎంకేతో పొత్తు ఏర్పాటు చేసింది. ఈ కూటమి ప్రకటన సమయంలోనే అన్నామలై సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని అమిత్ షా ప్రకటించారు. దీనిలో భాగంగా ఆయనను ఏపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లుతోంది. ఈ నిర్ణయాన్ని తెలుగుదేశం, జనసేన పార్టీలూ అంగీకరించినట్లు తెలుస్తోంది. అన్నామలై ఎంపికతో ఏపీ, తెలంగాణలలో పార్టీ బలోపేతానికి తోడ్పడుతుందని బీజేపీ భావిస్తోంది. చివరి నిమిషంలో మార్పు జరిగితే తప్ప, సాయిరెడ్డి స్థానంలో అన్నామలై ఎంపిక దాదాపు ఖాయం అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో స్పష్టంగా వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?
వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!
పవన్ చేతికి సెలైన్ డ్రిప్.. అసలేమైందంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం!
చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!
ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!
టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!
వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..
వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: