భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడి ఎంపికపై స్పష్టత త్వరలోనే రావొచ్చని రాజకీయం వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏప్రిల్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన కీలక సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరయ్యారు. ఏప్రిల్ 20 తర్వాత నూతన జాతీయ అధ్యక్షుడి ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం. దీనికంటే ముందు రాష్ట్ర అధ్యక్షుల నియామకం పూర్తి చేయాలని అధిష్టానం చూస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నాయకుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరగా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టుల జాబితా విడుదల! కీలక కమిటీలకు కొత్త చైర్మన్ ! లిస్ట్ ఇదే!
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఈటల రాజేందర్ పేరు మొదట స్థానంలో ఉండగా, ఆయనకు పోటీగా బండి సంజయ్, అరవింద్, డీకే అరుణ, రఘునందన్ రావు వంటి నేతలు ఉన్నారు. జి. కిషన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నందున పూర్తిగా రాష్ట్ర పార్టీపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇదే నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించే ఆలోచనలో ఉంది. ఇదే సమయంలో ఏపీలో కూడా పార్టీ అధ్యక్ష పదవికి మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పురంధేశ్వరిని కొనసాగించే అవకాశముంది, అయితే విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్, పార్థ సారధి, సుజనా చౌదరి వంటి నేతలు పోటీలో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ సామాజిక సమీకరణాలు, నాయకుల సీనియారిటీ, ప్రజాదరణ వంటి అంశాల ఆధారంగా ఎంపిక జరగనుంది.
ఇది కూడా చదవండి: జగన్ కి మరో దిమ్మతిరిగే షాక్.. హైదరాబాద్ లో వైసీపీ నేత కృష్ణవేణి అరెస్ట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరో రెండు నామినేటెడ్ పోస్టులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! వారిద్దరినీ వరించిన కీలక పదవులు!
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!
తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!
నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!
ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!
సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!
వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?
వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..
వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: