అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను (టారిఫ్‌లు) సవాలు చేస్తూ కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో దావా వేయనుంది. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని, వాటిని విధించే అధికారం అధ్యక్షుడికి లేదని ఆ రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్రంగా విమర్శించారు. అమెరికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన కాలిఫోర్నియా, ఈ విషయంలో ట్రంప్ పరిపాలనా యంత్రాంగంపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ టారిఫ్‌ల వల్ల కాలిఫోర్నియాలోని కుటుంబాలు, వ్యాపారాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర గందరగోళానికి గురవుతున్నాయని గవర్నర్ న్యూసమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ధరలు పెరిగిపోతున్నాయని, ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "అమెరికన్ కుటుంబాల ప్రయోజనాల కోసం మేము నిలబడుతున్నాం. ఈ గందరగోళం కొనసాగడానికి వీల్లేదు" అని ఆయన పేర్కొన్నారు. ఈ విధ్వంసకర, గందరగోళ టారిఫ్‌లను విధించే అధికారం డొనాల్డ్ ట్రంప్‌కు లేదని, దీనివల్ల అమెరికా చాలా నష్టపోతుందని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు.
అందుకే తాము ఆయనను కోర్టుకు లాగుతున్నామని స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ 'అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం' కింద ఈ టారిఫ్‌లను విధించారు. అయితే, ఏకపక్షంగా ఇలాంటి సుంకాలను విధించే అధికారాన్ని ఆ చట్టం అధ్యక్షుడికి ఇవ్వలేదని కాలిఫోర్నియా అధికారులు తమ దావాలో వాదించనున్నారు. ఈ మేరకు ఉత్తర కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో త్వరలో దావా దాఖలు చేయనున్నట్లు సమాచారం. దేశంలోకి వచ్చే సరుకు రవాణాలో 40 శాతం కాలిఫోర్నియాలోని రెండు ప్రధాన ఓడరేవుల ద్వారానే జరుగుతుందని, ఇందులో చైనా నుంచే దాదాపు 50 శాతం ఉంటుందని గవర్నర్ వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఈ టారిఫ్‌ల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు. 675 బిలియన్ డాలర్లకు పైగా ద్వైపాక్షిక వాణిజ్యంతో, మిలియన్ల కొద్దీ ఉద్యోగాలకు కాలిఫోర్నియా కేంద్రంగా ఉంది.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్‌గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!
తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!
నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!
ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!
సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!
వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?
వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..
వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: