జిల్లా కేంద్రమైన ఒంగోలులో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పశ్చిమం వైపు మరో బైపాస్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి. అందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
జిల్లా కేంద్రమైన ఒంగోలులో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పశ్చిమం వైపు మరో బైపాస్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి. అందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. రూ.వెయ్యి కోట్ల లోపు ప్రాజెక్టులకు అయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే అనుమతులు మంజూరు చేస్తుండటంతో అందుకు అనుగుణంగా రెండు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రెండో బైసాస్ రోడ్డుపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈనెల 9న కలెక్టరేట్‌లో కలెక్టర్‌తోపాటు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. తదనుగుణంగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారుచేసేలా చర్యలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..
ముందుగా మద్దిపాడు మండలం కొష్టాల నుంచి టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం వద్ద కలిపే విధంగా డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు విలువ రూ.1,400 కోట్లకుపైన అవుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్రప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రెండో ప్రతిపాదనను కూడా సిద్ధం చేస్తున్నారు. త్రోవగుంట సమీపంలోని చీరాల రోడ్డు నుంచి లింగంగుంట, పేర్నమిట్ల మీదుగా మంగమూరు, భగీరథ ప్యాక్టరీ, చెరువుకొమ్ముపాలెం పక్కగా బీఈడీ కాలేజీ వద్ద జాతీయ రహదారిలో కలిపేందుకు మరో డీపీఆర్ నివేదికను రూపొందించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు రూ.800 కోట్లు వ్యయం అవుతుందని సమాచారం. ఇటీవల సంబంధిత అధికారులు ఎంపీ మాగుంటతో కూడా చర్చించినట్లు సమాచారం. అయితే కేంద్రం రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇస్తున్నందున తదనుగుణంగా డీపీఆర్‌లను సిద్ధం చేయాలని సూచించారు. అవి సిద్ధమయ్యాక సంబంధిత శాసనసభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. వాటిని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి అక్కడి నుంచి కేంద్రప్రభుత్వానికి పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.ఇక్కడ అక్కడ చుట్టూ భూముల రెట్లు అధికంగా పెరుగుతాయి అనే చెప్పవచ్చు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?
లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!
అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రి, రాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!
మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!
కసిరెడ్డి కేసులో కీలక మలుపు! రేపు సిట్ ముందు హాజరు! వారికి ఇక మూడిందే!
వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!
సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!
జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!
జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: