భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆ పార్టీలో కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరిని కొనసాగిస్తారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అనే దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమె గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. భాజపా విధానాల ప్రకారం అధ్యక్ష పదవిలో వరసగా రెండుసార్లు కొనసాగేందుకు వీలుంది. మరోవైపు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరుతో పాటు ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు అధ్యక్ష పదవికి వినిపిస్తోంది. మరికొందరు ఇతర నేతలు కూడా అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. జాతీయ స్థాయి నేతలు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు వారి వద్ద తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ విజయవాడలోని రాష్ట్ర కార్యాలయానికి శుక్రవారం రావడంతో సీనియర్ నేతలు, ఆశావహుల హడావుడి కనిపించింది. అధికార కూటమిలోని తెదేపా, జనసేనలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని నడిపే వారు అధ్యక్ష స్థానంలో ఉండాలి. ఈ రెండు పార్టీ అగ్రనేతలకు దీటైన స్థాయిలో ఉండాలని, పార్టీ కార్యకలాపాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించే వారు కావాలని భాజపా భావిస్తోంది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని అధిష్టానం ఆలోచిస్తోంది. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి నాయకత్వం కొనసాగింపునకు పార్టీపరంగా అభ్యంతరాలు లేవు. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పదవి భర్తీ విషయంలో అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఒకవేళ పురందేశ్వరికి ఏదైనా కొత్త బాధ్యత అప్పగించాలని అధిష్ఠానం భావిస్తే మాత్రం నాయకత్వంలో మార్పు ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! ఆ పార్టీలోకి అడుగు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: