విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వై మురళీ, ఎం. వెంకటరావులను పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత యడ్ల తాతాజీతో పాటు ఆయన సోదరుడు నాగేశ్వరరావుపై కూడా కేసు నమోదు కాగా... వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను నరసాపురం డీఎస్పీ శ్రీవేద మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇది కూడా చదవండి: సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!
పాలకొల్లు పట్టణ పరిధిలోని పెనుమదం బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ భవనంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి నిర్వహించినట్లు తెలిపారు. అందులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 33వేల నగదు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యడ్ల తాతాజీ, ఆయన సోదరుడు నాగేశ్వరరావు గత పదేళ్లుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని, ప్రస్తుతం రెండు పోలీస్ బృందాలు వారి కోసం గాలిస్తున్నాయని డీఎస్పీ శ్రీవేద విలేకరులతో అన్నారు.
ఇది కూడా చదవండి: రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!
జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: